లూకా సువార్త 17 : 1 (ERVTE)
{పాపము మరియు క్షమాపణ} (మత్తయి 18:6-7; 21-22; మార్కు 9:42) [PS] యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు.
లూకా సువార్త 17 : 2 (ERVTE)
ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది.
లూకా సువార్త 17 : 3 (ERVTE)
అందువల్ల జాగ్రత్త! [PE][PS] “మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి.
లూకా సువార్త 17 : 4 (ERVTE)
అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.” [PS]
లూకా సువార్త 17 : 5 (ERVTE)
{నీ విశ్వాసము ఎంత గొప్పది} [PS] అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి పరచండి” అని అన్నారు. [PE][PS]
లూకా సువార్త 17 : 6 (ERVTE)
ప్రభువు అన్నాడు: “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాచాలు; మీరు కంబళి చెట్టుతో, ‘నీవు నీ వేర్లతో బాటు పెళ్లగింపబడి వెళ్ళి సముద్రంలో పడి అక్కడ నాటుకుపో!’ అని అంటే అది మీ మాట వింటుంది. [PS]
లూకా సువార్త 17 : 7 (ERVTE)
{సేవకుని కర్తవ్యం} [PS] “మీ పొలం దున్నే సేవకుడో లేక మీ గొఱ్ఱెలు కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం నుండి యింటికి రాగానే, ‘రా! వచ్చి కూర్చొని భోజనం చెయ్యి’ అని అతనితో అంటారా? అనరు.
లూకా సువార్త 17 : 8 (ERVTE)
దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు.
లూకా సువార్త 17 : 9 (ERVTE)
మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా?
లూకా సువార్త 17 : 10 (ERVTE)
మీరు కూడా చెప్పిన విధంగా చేసాక ‘మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. అది మా కర్తవ్యం’ అని అనాలి.” [PS]
లూకా సువార్త 17 : 11 (ERVTE)
{పదిమంది కుష్టురోగులకు నయం చెయ్యటం} [PS] యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు.
లూకా సువార్త 17 : 12 (ERVTE)
ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని,
లూకా సువార్త 17 : 13 (ERVTE)
“యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు. [PE][PS]
లూకా సువార్త 17 : 14 (ERVTE)
ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు. [PE][PS] వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది.
లూకా సువార్త 17 : 15 (ERVTE)
వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు.
లూకా సువార్త 17 : 16 (ERVTE)
యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు.
లూకా సువార్త 17 : 17 (ERVTE)
యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి?
లూకా సువార్త 17 : 18 (ERVTE)
ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు.
లూకా సువార్త 17 : 19 (ERVTE)
ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 17 : 20 (ERVTE)
{దేవుని రాజ్యం రావటం} (మత్తయి 24:23-28; 37-41) [PS] కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు. [PE][PS] యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు.
లూకా సువార్త 17 : 21 (ERVTE)
‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు. [PE][PS]
లూకా సువార్త 17 : 22 (ERVTE)
ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు.
లూకా సువార్త 17 : 23 (ERVTE)
ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి. [PS]
లూకా సువార్త 17 : 24 (ERVTE)
{యేసు తిరిగి వచ్చునప్పుడు} [PS] “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు.
లూకా సువార్త 17 : 25 (ERVTE)
కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి. [PE][PS]
లూకా సువార్త 17 : 26 (ERVTE)
“నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది.
లూకా సువార్త 17 : 27 (ERVTE)
నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు. [PE][PS]
లూకా సువార్త 17 : 28 (ERVTE)
“లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు.
లూకా సువార్త 17 : 29 (ERVTE)
కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది.
లూకా సువార్త 17 : 30 (ERVTE)
మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది. [PE][PS]
లూకా సువార్త 17 : 31 (ERVTE)
“ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు.
లూకా సువార్త 17 : 32 (ERVTE)
లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి. [PE][PS]
లూకా సువార్త 17 : 33 (ERVTE)
“తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు.
లూకా సువార్త 17 : 34 (ERVTE)
ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు.
లూకా సువార్త 17 : 35 (ERVTE)
ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు.
లూకా సువార్త 17 : 36 (ERVTE)
[*కొన్ని గ్రీకు ప్రతులలో 36వ వచనం చేర్చబడింది: “ఇద్దరు మనుష్యులు పొలంలో ఉంటే ఒకణ్ణి తీసుకువెళ్ళి యింకొకణ్ణి వదిలి వేస్తాడు.”] [PE][PS]
లూకా సువార్త 17 : 37 (ERVTE)
“ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు. [PE][PS] ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: