లూకా సువార్త 21 : 1 (ERVTE)
{నిజమైన కానుక} (మార్కు 12:41-44) [PS] యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు.
లూకా సువార్త 21 : 2 (ERVTE)
అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు.
లూకా సువార్త 21 : 3 (ERVTE)
ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది.
లూకా సువార్త 21 : 4 (ERVTE)
యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 21 : 5 (ERVTE)
{యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం} (మత్తయి 24:1-14; మార్కు 13:1-13) [PS] ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. [PE][PS]
లూకా సువార్త 21 : 6 (ERVTE)
కాని యేసు, “మీరిక్కడ చూస్తూన్నవన్నీ రాయి మీద రాయి నిలువకుండా నేలమట్టమై పోయ్యే సమయం వస్తుంది” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 21 : 7 (ERVTE)
వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి” అని అడిగారు. [PE][PS]
లూకా సువార్త 21 : 8 (ERVTE)
ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట అనేకులు వచ్చి, ‘నేనే ఆయన్ని అని, కాలం సమీపించింది’ అని అంటారు. వాళ్ళను అనుసరించకండి.
లూకా సువార్త 21 : 9 (ERVTE)
యుద్ధాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 21 : 10 (ERVTE)
ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది.
లూకా సువార్త 21 : 11 (ERVTE)
అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి. [PE][PS]
లూకా సువార్త 21 : 12 (ERVTE)
“కాని యివన్నీ జరుగక ముందే యూదులు మిమ్మల్ని బంధించి, హింసించి సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, రాజ్యాధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు కారణంగా జరుగుతాయి.
లూకా సువార్త 21 : 13 (ERVTE)
తద్వారా వాళ్ళకు సువార్తను గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది.
లూకా సువార్త 21 : 14 (ERVTE)
వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణయించుకోండి.
లూకా సువార్త 21 : 15 (ERVTE)
ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడటానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ మాటల్ని ఖండించకుండా ఉండేటట్లు చేస్తాను. వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను.
లూకా సువార్త 21 : 16 (ERVTE)
మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు.
లూకా సువార్త 21 : 17 (ERVTE)
నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు.
లూకా సువార్త 21 : 18 (ERVTE)
కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు.
లూకా సువార్త 21 : 19 (ERVTE)
సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు. [PE][PS]
లూకా సువార్త 21 : 20 (ERVTE)
{యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం} (మత్తయి 24:15-21; మార్కు 13:14-19) [PS] “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి.
లూకా సువార్త 21 : 21 (ERVTE)
అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి.
లూకా సువార్త 21 : 22 (ERVTE)
ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం.
లూకా సువార్త 21 : 23 (ERVTE)
ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు.
లూకా సువార్త 21 : 24 (ERVTE)
కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు. (మత్తయి 24:29–31; మార్కు 13:24–27) [PE][PS]
లూకా సువార్త 21 : 25 (ERVTE)
{భయపడవద్దు} [PS] “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి.
లూకా సువార్త 21 : 26 (ERVTE)
రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి.
లూకా సువార్త 21 : 27 (ERVTE)
అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు.
లూకా సువార్త 21 : 28 (ERVTE)
ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 21 : 29 (ERVTE)
{చెట్ల ఉపమానం} (మత్తయి 24:32-35; మార్కు 13:28-31) [PS] ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి.
లూకా సువార్త 21 : 30 (ERVTE)
చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు.
లూకా సువార్త 21 : 31 (ERVTE)
అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి. [PE][PS]
లూకా సువార్త 21 : 32 (ERVTE)
“ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు.
లూకా సువార్త 21 : 33 (ERVTE)
ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి. [PS]
లూకా సువార్త 21 : 34 (ERVTE)
{అన్ని వేళలా సిద్ధంగా ఉండండి} [PS] “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది.
లూకా సువార్త 21 : 35 (ERVTE)
అది ప్రపంచం మీదికంతా వస్తుంది.
లూకా సువార్త 21 : 36 (ERVTE)
అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.” [PE][PS]
లూకా సువార్త 21 : 37 (ERVTE)
యేసు ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళ్ళి గడిపేవాడు.
లూకా సువార్త 21 : 38 (ERVTE)
ప్రజలందరు ఆయన బోధనలు వినాలని తెల్లవారుఝామునే మందిరానికి వెళ్ళేవాళ్ళు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: