లూకా సువార్త 23 : 1 (ERVTE)
{పిలాతు సమక్షంలో యేసు} [PS] మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి,
లూకా సువార్త 23 : 2 (ERVTE)
“ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు. [PE][PS]
లూకా సువార్త 23 : 3 (ERVTE)
ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. [PE][PS] “ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 4 (ERVTE)
ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 5 (ERVTE)
కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు. [PS]
లూకా సువార్త 23 : 6 (ERVTE)
{హేరోదు సమక్షంలో యేసు} [PS] ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు.
లూకా సువార్త 23 : 7 (ERVTE)
యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 8 (ERVTE)
హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు.
లూకా సువార్త 23 : 9 (ERVTE)
అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు.
లూకా సువార్త 23 : 10 (ERVTE)
ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు.
లూకా సువార్త 23 : 11 (ERVTE)
హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు.
లూకా సువార్త 23 : 12 (ERVTE)
ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. [PE][PS]
లూకా సువార్త 23 : 13 (ERVTE)
{మరణదండన విధించటం} (మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహాను 18:39-19:16) [PS] పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు.
లూకా సువార్త 23 : 14 (ERVTE)
వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు.
లూకా సువార్త 23 : 15 (ERVTE)
హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు.
లూకా సువార్త 23 : 16 (ERVTE)
అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు.
లూకా సువార్త 23 : 17 (ERVTE)
[*కొన్ని గ్రీకు ప్రతులలో 17వ వచనం చేర్చబడింది: “ప్రతి సంవత్సరం పస్కా పండుగ సందర్భంగా ప్రజల కోరికపై ఒక ఖైదీని పిలాతు విడుదల చేయుట ఆనవాయితీ.”] [PE][PS]
లూకా సువార్త 23 : 18 (ERVTE)
వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు.
లూకా సువార్త 23 : 19 (ERVTE)
బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 20 (ERVTE)
యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు.
లూకా సువార్త 23 : 21 (ERVTE)
కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు. [PE][PS]
లూకా సువార్త 23 : 22 (ERVTE)
మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 23 (ERVTE)
కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు.
లూకా సువార్త 23 : 24 (ERVTE)
పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు.
లూకా సువార్త 23 : 25 (ERVTE)
తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 26 (ERVTE)
{యేసుని సిలువకు వేయటం} (మత్తయి 27:32-44; మార్కు 15:21-32; యోహాను 19:17-19) [PS] వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు. [PE][PS]
లూకా సువార్త 23 : 27 (ERVTE)
చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు.
లూకా సువార్త 23 : 28 (ERVTE)
యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి.
లూకా సువార్త 23 : 29 (ERVTE)
‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి.
లూకా సువార్త 23 : 30 (ERVTE)
అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు. [✡ఉల్లేఖము: హోషేయా 10:8.]
లూకా సువార్త 23 : 31 (ERVTE)
చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 32 (ERVTE)
మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు.
లూకా సువార్త 23 : 33 (ERVTE)
కల్వరి [†కల్వరి అనగా పుర్రె.] అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు. [PE][PS]
లూకా సువార్త 23 : 34 (ERVTE)
యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు” అని అన్నాడు. [‡“తండ్రి … తెలియదు” కొన్ని ప్రాచీన గ్రీకు ప్రతులలో ఈ పదాలు లేవు.] [PE][PS] వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు.
లూకా సువార్త 23 : 35 (ERVTE)
ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు. [PE][PS]
లూకా సువార్త 23 : 36 (ERVTE)
భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ
లూకా సువార్త 23 : 37 (ERVTE)
“నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు.
లూకా సువార్త 23 : 38 (ERVTE)
“ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు. [PE][PS]
లూకా సువార్త 23 : 39 (ERVTE)
ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 40 (ERVTE)
కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే.
లూకా సువార్త 23 : 41 (ERVTE)
మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు.
లూకా సువార్త 23 : 42 (ERVTE)
ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 43 (ERVTE)
యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో [§పరదైసు చనిపోయిన విశ్వాసుల ఆత్మలు విశ్రాంతి తీసికోనే స్థలం.] ఉంటావు” అని సమాధానం చెప్పాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 44 (ERVTE)
{యేసు మరణం} (మత్తయి 27:45-56; మార్కు 15:33-41; యోహాను 19:28-30) [PS] (44-45) అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది.
లూకా సువార్త 23 : 45 (ERVTE)
లూకా సువార్త 23 : 46 (ERVTE)
యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 47 (ERVTE)
శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు. [PE][PS]
లూకా సువార్త 23 : 48 (ERVTE)
ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు.
లూకా సువార్త 23 : 49 (ERVTE)
కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు. [PE][PS]
లూకా సువార్త 23 : 50 (ERVTE)
{యేసును సమాధి చేయటం} (మత్తయి 27:57-61; మార్కు 15:42-47; యోహాను 19:38-42) [PS] అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు.
లూకా సువార్త 23 : 51 (ERVTE)
నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు.
లూకా సువార్త 23 : 52 (ERVTE)
యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు.
లూకా సువార్త 23 : 53 (ERVTE)
అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి యిదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడి ఉంది.
లూకా సువార్త 23 : 54 (ERVTE)
అది విశ్రాంతిరోజు కొరకు సిద్ధమౌతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది. [PE][PS]
లూకా సువార్త 23 : 55 (ERVTE)
యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు.
లూకా సువార్త 23 : 56 (ERVTE)
ఆ తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసారు. [PE][PS] కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56

BG:

Opacity:

Color:


Size:


Font: