లూకా సువార్త 24 : 1 (ERVTE)
ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు.
లూకా సువార్త 24 : 2 (ERVTE)
సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు.
లూకా సువార్త 24 : 3 (ERVTE)
అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు.
లూకా సువార్త 24 : 4 (ERVTE)
దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమైవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి.
లూకా సువార్త 24 : 5 (ERVTE)
భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు. ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు?
లూకా సువార్త 24 : 6 (ERVTE)
[This verse may not be a part of this translation]
లూకా సువార్త 24 : 7 (ERVTE)
[This verse may not be a part of this translation]
లూకా సువార్త 24 : 8 (ERVTE)
అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
లూకా సువార్త 24 : 9 (ERVTE)
[This verse may not be a part of this translation]
లూకా సువార్త 24 : 10 (ERVTE)
[This verse may not be a part of this translation]
లూకా సువార్త 24 : 11 (ERVTE)
ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు.
లూకా సువార్త 24 : 12 (ERVTE)
అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళి పోయాడు.
లూకా సువార్త 24 : 13 (ERVTE)
అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేంకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.
లూకా సువార్త 24 : 14 (ERVTE)
వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు.
లూకా సువార్త 24 : 15 (ERVTE)
వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు.
లూకా సువార్త 24 : 16 (ERVTE)
కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు.
లూకా సువార్త 24 : 17 (ERVTE)
యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది.
లూకా సువార్త 24 : 18 (ERVTE)
వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 19 (ERVTE)
“ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు. వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు.
లూకా సువార్త 24 : 20 (ERVTE)
మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు.
లూకా సువార్త 24 : 21 (ERVTE)
ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
లూకా సువార్త 24 : 22 (ERVTE)
అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు.
లూకా సువార్త 24 : 23 (ERVTE)
కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు.
లూకా సువార్త 24 : 24 (ERVTE)
మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.
లూకా సువార్త 24 : 25 (ERVTE)
యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు?
లూకా సువార్త 24 : 26 (ERVTE)
క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 27 (ERVTE)
ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.
లూకా సువార్త 24 : 28 (ERVTE)
వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు.
లూకా సువార్త 24 : 29 (ERVTE)
కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.
లూకా సువార్త 24 : 30 (ERVTE)
వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు.
లూకా సువార్త 24 : 31 (ERVTE)
అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు.
లూకా సువార్త 24 : 32 (ERVTE)
ఆ తర్వాత వాళ్ళు, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని ఆ యిద్దరూ మాట్లాడుకున్నారు.
లూకా సువార్త 24 : 33 (ERVTE)
వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు.
లూకా సువార్త 24 : 34 (ERVTE)
వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 35 (ERVTE)
ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.
లూకా సువార్త 24 : 36 (ERVTE)
వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగు గాక” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 37 (ERVTE)
వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు.
లూకా సువార్త 24 : 38 (ERVTE)
యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి?
లూకా సువార్త 24 : 39 (ERVTE)
నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 40 (ERVTE)
ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు.
లూకా సువార్త 24 : 41 (ERVTE)
వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు.
లూకా సువార్త 24 : 42 (ERVTE)
వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు.
లూకా సువార్త 24 : 43 (ERVTE)
ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.
లూకా సువార్త 24 : 44 (ERVTE)
ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
లూకా సువార్త 24 : 45 (ERVTE)
అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు.
లూకా సువార్త 24 : 46 (ERVTE)
ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు!
లూకా సువార్త 24 : 47 (ERVTE)
పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేంలో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది.
లూకా సువార్త 24 : 48 (ERVTE)
మీరు వీటికి సాక్షులు.
లూకా సువార్త 24 : 49 (ERVTE)
నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.
లూకా సువార్త 24 : 50 (ERVTE)
ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు.
లూకా సువార్త 24 : 51 (ERVTE)
వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు.
లూకా సువార్త 24 : 52 (ERVTE)
ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
లూకా సువార్త 24 : 53 (ERVTE)
వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53

BG:

Opacity:

Color:


Size:


Font: