మార్కు సువార్త 13 : 1 (ERVTE)
{యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం} (మత్తయి 24:1-44; లూకా 21:5-33) [PS] యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 2 (ERVTE)
యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 3 (ERVTE)
యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో
మార్కు సువార్త 13 : 4 (ERVTE)
“ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు. [PE][PS]
మార్కు సువార్త 13 : 5 (ERVTE)
యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి.
మార్కు సువార్త 13 : 6 (ERVTE)
అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు.
మార్కు సువార్త 13 : 7 (ERVTE)
మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
మార్కు సువార్త 13 : 8 (ERVTE)
దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట. [PE][PS]
మార్కు సువార్త 13 : 9 (ERVTE)
“మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది.
మార్కు సువార్త 13 : 10 (ERVTE)
మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి.
మార్కు సువార్త 13 : 11 (ERVTE)
మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 12 (ERVTE)
“సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు.
మార్కు సువార్త 13 : 13 (ERVTE)
నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 14 (ERVTE)
“నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే [*నాశనం … కనిపిస్తే దానియేలు 9:27; 11:31; 12:11 చూడండి.] యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి.
మార్కు సువార్త 13 : 15 (ERVTE)
ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు.
మార్కు సువార్త 13 : 16 (ERVTE)
పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు. [PE][PS]
మార్కు సువార్త 13 : 17 (ERVTE)
“గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా!
మార్కు సువార్త 13 : 18 (ERVTE)
ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి.
మార్కు సువార్త 13 : 19 (ERVTE)
ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు.
మార్కు సువార్త 13 : 20 (ERVTE)
కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 21 (ERVTE)
“ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి.
మార్కు సువార్త 13 : 22 (ERVTE)
దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు.
మార్కు సువార్త 13 : 23 (ERVTE)
అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను. [PE][PS]
మార్కు సువార్త 13 : 24 (ERVTE)
“కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో ‘సూర్యుడు చీకటైపోతాడు. [QBR2] చంద్రుడు తన వెలుగును వెదజల్లడు. [QBR]
మార్కు సువార్త 13 : 25 (ERVTE)
ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. [QBR2] ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’ యెషయా 13:10] ; 34:4] [PS]
మార్కు సువార్త 13 : 26 (ERVTE)
“అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు.
మార్కు సువార్త 13 : 27 (ERVTE)
ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు. [PE][PS]
మార్కు సువార్త 13 : 28 (ERVTE)
“అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు.
మార్కు సువార్త 13 : 29 (ERVTE)
అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు.
మార్కు సువార్త 13 : 30 (ERVTE)
ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును.
మార్కు సువార్త 13 : 31 (ERVTE)
ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు. [PE][PS]
మార్కు సువార్త 13 : 32 (ERVTE)
“ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు.
మార్కు సువార్త 13 : 33 (ERVTE)
జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి. [†ఉండండి కొన్ని గ్రీకు ప్రతులలో ‘ప్రార్థించండి’ అని చేర్చబడింది.] ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు. [PE][PS]
మార్కు సువార్త 13 : 34 (ERVTE)
“ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు.
మార్కు సువార్త 13 : 35 (ERVTE)
ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు.
మార్కు సువార్త 13 : 36 (ERVTE)
అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో.
మార్కు సువార్త 13 : 37 (ERVTE)
హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.” [PE]
❮
❯