మార్కు సువార్త 14 : 1 (ERVTE)
{యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం} (మత్తయి 26:1-5; లూకా 22:1-2; యోహాను 11:45-53) [PS] పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు.
మార్కు సువార్త 14 : 2 (ERVTE)
“కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 3 (ERVTE)
{బేతనియ గ్రామంలో తైలాభిషేకం} (మత్తయి 26:6-13; లూకా 12:1-8) [PS] ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది. [PE][PS]
మార్కు సువార్త 14 : 4 (ERVTE)
ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు?
మార్కు సువార్త 14 : 5 (ERVTE)
దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు [*మూడు వందల దేనారాలు వెండి నాణాలు.] వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 6 (ERVTE)
యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది.
మార్కు సువార్త 14 : 7 (ERVTE)
పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను.
మార్కు సువార్త 14 : 8 (ERVTE)
ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది. [†అత్తరు పోసింది ఇది యూదుల ఆచారము.]
మార్కు సువార్త 14 : 9 (ERVTE)
ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 10 (ERVTE)
{యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం} (మత్తయి 26:14-16; లూకా 22:3-6) [PS] ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.
మార్కు సువార్త 14 : 11 (ERVTE)
వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. (మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30) [PE][PS]
మార్కు సువార్త 14 : 12 (ERVTE)
{పస్కా భోజనం} [PS] పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా [‡పస్కా ముఖ్యమైన యూదుల పండుగ.] పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 13 (ERVTE)
యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి.
మార్కు సువార్త 14 : 14 (ERVTE)
అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి.
మార్కు సువార్త 14 : 15 (ERVTE)
అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.” [PE][PS]
మార్కు సువార్త 14 : 16 (ERVTE)
శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 17 (ERVTE)
సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు.
మార్కు సువార్త 14 : 18 (ERVTE)
వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 19 (ERVTE)
వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 20 (ERVTE)
యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు.
మార్కు సువార్త 14 : 21 (ERVTE)
లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు. (మత్తయి 26:26-30; లూకా 22:15-20; 1 కొరింథీ 11:23-25) [PE][PS]
మార్కు సువార్త 14 : 22 (ERVTE)
{ప్రభు రాత్రి భోజనము} [PS] అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 23 (ERVTE)
ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు.
మార్కు సువార్త 14 : 24 (ERVTE)
“ఇది నా నిబంధన [§నిబంధన కొన్ని గ్రీకు ప్రతులలో ‘క్రొత్త’ అని చేర్చబడింది.] రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను.
మార్కు సువార్త 14 : 25 (ERVTE)
ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 26 (ERVTE)
వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 27 (ERVTE)
{యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం} (మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38) [PS] యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో, ‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను! [QBR2] గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’ జెకర్యా 13:7] అని వ్రాయబడింది.
మార్కు సువార్త 14 : 28 (ERVTE)
కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 29 (ERVTE)
అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 30 (ERVTE)
యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు [*రెండు కొన్ని గ్రీకు ప్రతులలో ‘రెండు’ అన్న సంఖ్య లేదు.] సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 31 (ERVTE)
కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 32 (ERVTE)
{యేసు ఏకాంతంగా ప్రార్థించటం} (మత్తయి 26:36-46; లూకా 22:39-46) [PS] అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు.
మార్కు సువార్త 14 : 33 (ERVTE)
కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, [†దుఃఖం అంటే మరణము.] ఆవేదన కలగటం మొదలుపెట్టింది.
మార్కు సువార్త 14 : 34 (ERVTE)
ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 35 (ERVTE)
ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ,
మార్కు సువార్త 14 : 36 (ERVTE)
ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 37 (ERVTE)
ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా?
మార్కు సువార్త 14 : 38 (ERVTE)
మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 39 (ERVTE)
యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు.
మార్కు సువార్త 14 : 40 (ERVTE)
ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. [PE][PS]
మార్కు సువార్త 14 : 41 (ERVTE)
యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు.
మార్కు సువార్త 14 : 42 (ERVTE)
లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 43 (ERVTE)
{యేసును బంధించటం} (మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12) [PS] ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 44 (ERVTE)
ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో [‡ముద్దు పెట్టుకొంటానో ‘ఎవరి నుదుట ముద్దు పెట్టుకొంటానో’ అని పాఠాంతరం.] ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు.
మార్కు సువార్త 14 : 45 (ERVTE)
వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు.
మార్కు సువార్త 14 : 46 (ERVTE)
వచ్చిన ప్రజలు యేసును బంధించారు.
మార్కు సువార్త 14 : 47 (ERVTE)
యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 48 (ERVTE)
యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా?
మార్కు సువార్త 14 : 49 (ERVTE)
నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు.
మార్కు సువార్త 14 : 50 (ERVTE)
అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 51 (ERVTE)
ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని,
మార్కు సువార్త 14 : 52 (ERVTE)
అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. (మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24) [PE][PS]
మార్కు సువార్త 14 : 53 (ERVTE)
{మహాసభ సమక్షంలో యేసు} [PS] వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు.
మార్కు సువార్త 14 : 54 (ERVTE)
పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 55 (ERVTE)
ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు.
మార్కు సువార్త 14 : 56 (ERVTE)
చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. [PE][PS]
మార్కు సువార్త 14 : 57 (ERVTE)
అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు:
మార్కు సువార్త 14 : 58 (ERVTE)
“ ‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.”
మార్కు సువార్త 14 : 59 (ERVTE)
కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 60 (ERVTE)
ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు.
మార్కు సువార్త 14 : 61 (ERVTE)
కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. [PE][PS] ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 62 (ERVTE)
యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 63 (ERVTE)
ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని [§దుస్తుల్ని చింపుకొని వాళ్ళు ఇలా తమ కోపం వ్యక్త పరిచే వాళ్ళు.] “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు?
మార్కు సువార్త 14 : 64 (ERVTE)
అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. [PE][PS] అందరూ మరణదండన విధించాలని అన్నారు.
మార్కు సువార్త 14 : 65 (ERVTE)
ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు. (మత్తయి 26:69-75; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27) [PE][PS]
మార్కు సువార్త 14 : 66 (ERVTE)
{పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం} [PS] పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది.
మార్కు సువార్త 14 : 67 (ERVTE)
పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది. [PE][PS]
మార్కు సువార్త 14 : 68 (ERVTE)
అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. [PE][PS]
మార్కు సువార్త 14 : 69 (ERVTE)
ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో, “ఇతడు వాళ్ళలో ఒకడు” అని మళ్ళీ అన్నది.
మార్కు సువార్త 14 : 70 (ERVTE)
మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు. [PE][PS] కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 14 : 71 (ERVTE)
పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 14 : 72 (ERVTE)
వెంటనే రెండవసారి [*రెండవసారి కొన్ని గ్రీకు ప్రతులలో ‘రెండు’ అన్న సంఖ్య లేదు.] కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72

BG:

Opacity:

Color:


Size:


Font: