మార్కు సువార్త 15 : 1 (ERVTE)
{పిలాతు సమక్షంలో యేసు} [PS] తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు [*పిలాతు యూదయ రాష్ట్రపాలకుడు. క్రీ. శ. 26-36.] అప్పగించారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 2 (ERVTE)
పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు. [PE][PS] “మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 3 (ERVTE)
ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు.
మార్కు సువార్త 15 : 4 (ERVTE)
అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 5 (ERVTE)
అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. [PE][PS]
మార్కు సువార్త 15 : 6 (ERVTE)
{మరణదండన విధించటం} (మత్తయి 27:15-31; లూకా 23:13-25; యోహాను 18:39-19:16) [PS] పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం.
మార్కు సువార్త 15 : 7 (ERVTE)
తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 8 (ERVTE)
ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు.
మార్కు సువార్త 15 : 9 (ERVTE)
(9-10) ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు.
మార్కు సువార్త 15 : 10 (ERVTE)
మార్కు సువార్త 15 : 11 (ERVTE)
కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 12 (ERVTE)
పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 13 (ERVTE)
వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 14 (ERVTE)
“ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు. [PE][PS] ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 15 (ERVTE)
ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 16 (ERVTE)
భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు.
మార్కు సువార్త 15 : 17 (ERVTE)
వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు.
మార్కు సువార్త 15 : 18 (ERVTE)
ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు.
మార్కు సువార్త 15 : 19 (ERVTE)
ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు.
మార్కు సువార్త 15 : 20 (ERVTE)
ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 21 (ERVTE)
{యేసుని సిలువకు వేయటం} (మత్తయి 27:32-44; లూకా 23:26-39; యోహాను 19:17-19) [PS] కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు.
మార్కు సువార్త 15 : 22 (ERVTE)
వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.
మార్కు సువార్త 15 : 23 (ERVTE)
అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు.
మార్కు సువార్త 15 : 24 (ERVTE)
ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 25 (ERVTE)
ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు.
మార్కు సువార్త 15 : 26 (ERVTE)
ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు.
మార్కు సువార్త 15 : 27 (ERVTE)
ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు.
మార్కు సువార్త 15 : 28 (ERVTE)
[†కొన్ని గ్రీకు ప్రతులలో 28వ వచనం చేర్చబడింది: “ ‘తద్వారా ఆయన్ని నేరస్తులతో సమానంగా పరిగణించారు’ అని శాస్త్రాల్లో వ్రాసిన వాక్యం నిజమయింది.”] [PE][PS]
మార్కు సువార్త 15 : 29 (ERVTE)
ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా.
మార్కు సువార్త 15 : 30 (ERVTE)
సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 31 (ERVTE)
ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు.
మార్కు సువార్త 15 : 32 (ERVTE)
ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 33 (ERVTE)
{యేసు మరణం} (మత్తయి 27:45-56; లూకా 23:44-49; యోహాను 19:28-30) [PS] మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.
మార్కు సువార్త 15 : 34 (ERVTE)
మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు” [✡ఉల్లేఖము: కీర్తన 22:1.] అని కేకవేసాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 35 (ERVTE)
దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 36 (ERVTE)
ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 37 (ERVTE)
పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 38 (ERVTE)
అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది.
మార్కు సువార్త 15 : 39 (ERVTE)
యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, [‡విని కొన్ని గ్రీకు ప్రతులలో ‘ఆయన కేక విని’ అని లేదు.] ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 40 (ERVTE)
కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు.
మార్కు సువార్త 15 : 41 (ERVTE)
గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. [PE][PS]
మార్కు సువార్త 15 : 42 (ERVTE)
{యేసును సమాధి చేయటం} (మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహాను 19:38-42) [PS] అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది.
మార్కు సువార్త 15 : 43 (ERVTE)
అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 44 (ERVTE)
యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
మార్కు సువార్త 15 : 45 (ERVTE)
ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు. [PE][PS]
మార్కు సువార్త 15 : 46 (ERVTE)
యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు.
మార్కు సువార్త 15 : 47 (ERVTE)
మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: