మార్కు సువార్త 3 : 1 (ERVTE)
{విశ్రాంతి రోజు యేసు నయం చేయటం} [PS] ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు.
మార్కు సువార్త 3 : 2 (ERVTE)
అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం.
మార్కు సువార్త 3 : 3 (ERVTE)
యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 3 : 4 (ERVTE)
అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు. [PE][PS]
మార్కు సువార్త 3 : 5 (ERVTE)
ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, ‘నీ చేయి చాపు’ అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది.
మార్కు సువార్త 3 : 6 (ERVTE)
ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు. [PS]
మార్కు సువార్త 3 : 7 (ERVTE)
{ప్రజలు యేసును అనుసరించటం} [PS] యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు.
మార్కు సువార్త 3 : 8 (ERVTE)
యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు. [PE][PS]
మార్కు సువార్త 3 : 9 (ERVTE)
చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు.
మార్కు సువార్త 3 : 10 (ERVTE)
ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు.
మార్కు సువార్త 3 : 11 (ERVTE)
చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి.
మార్కు సువార్త 3 : 12 (ERVTE)
యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు. [PE][PS]
మార్కు సువార్త 3 : 13 (ERVTE)
{యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం} (మత్తయి 10:1-4; లూకా 6:12-16) [PS] యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు.
మార్కు సువార్త 3 : 14 (ERVTE)
ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం.
మార్కు సువార్త 3 : 15 (ERVTE)
దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు.
మార్కు సువార్త 3 : 16 (ERVTE)
ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి: సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.
మార్కు సువార్త 3 : 17 (ERVTE)
జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.
మార్కు సువార్త 3 : 18 (ERVTE)
అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలటు అని పిలవబడే సీమోను,
మార్కు సువార్త 3 : 19 (ERVTE)
యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. [PE][PS]
మార్కు సువార్త 3 : 20 (ERVTE)
{యేసుని శక్తి దేవునినుండి వచ్చినది} (మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12-10) [PS] ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు.
మార్కు సువార్త 3 : 21 (ERVTE)
ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు. [PE][PS]
మార్కు సువార్త 3 : 22 (ERVTE)
యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 3 : 23 (ERVTE)
అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు?
మార్కు సువార్త 3 : 24 (ERVTE)
ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు.
మార్కు సువార్త 3 : 25 (ERVTE)
కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు.
మార్కు సువార్త 3 : 26 (ERVTE)
సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది. [PE][PS]
మార్కు సువార్త 3 : 27 (ERVTE)
“నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు. [PE][PS]
మార్కు సువార్త 3 : 28 (ERVTE)
“నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు.
మార్కు సువార్త 3 : 29 (ERVTE)
కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.” [PE][PS]
మార్కు సువార్త 3 : 30 (ERVTE)
ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 3 : 31 (ERVTE)
{యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు} (మత్తయి 12:46-50; లూకా 8:19-21) [PS] యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు.
మార్కు సువార్త 3 : 32 (ERVTE)
యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు. [PE][PS]
మార్కు సువార్త 3 : 33 (ERVTE)
“ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ
మార్కు సువార్త 3 : 34 (ERVTE)
చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు.
మార్కు సువార్త 3 : 35 (ERVTE)
దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: