మార్కు సువార్త 7 : 1 (ERVTE)
{దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం} (మత్తయి 15:1-20) [PS] యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, [*పరిసయ్యులు యూదుల న్యాయశాస్త్రాన్ని, వాళ్ళ ఆచారాల్ని నిష్ఠగా పాటించే ఒక యూదుల శాఖ.] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు.
మార్కు సువార్త 7 : 2 (ERVTE)
వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు.
మార్కు సువార్త 7 : 3 (ERVTE)
పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు.
మార్కు సువార్త 7 : 4 (ERVTE)
వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను [†గిన్నెలను కొన్ని గ్రీకు ప్రతులలో ‘మరియు భోజనం చేసే బల్లల్ని’ అని చేర్చబడింది.] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం. [PE][PS]
మార్కు సువార్త 7 : 5 (ERVTE)
అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు. [PE][PS]
మార్కు సువార్త 7 : 6 (ERVTE)
యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు: ‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. [QBR2] కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. [QBR]
మార్కు సువార్త 7 : 7 (ERVTE)
వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు. [QBR2] కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’ యెషయా 29:13]
మార్కు సువార్త 7 : 8 (ERVTE)
దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు. [PE][PS]
మార్కు సువార్త 7 : 9 (ERVTE)
“మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు.
మార్కు సువార్త 7 : 10 (ERVTE)
ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని [✡ఉల్లేఖము: నిర్గమ. 20:12; ద్వీతి. 5:16.] మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు. [✡ఉల్లేఖము: నిర్గమ. 21:17.]
మార్కు సువార్త 7 : 11 (ERVTE)
కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే,
మార్కు సువార్త 7 : 12 (ERVTE)
ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు.
మార్కు సువార్త 7 : 13 (ERVTE)
మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 7 : 14 (ERVTE)
యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి.
మార్కు సువార్త 7 : 15 (ERVTE)
బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు.
మార్కు సువార్త 7 : 16 (ERVTE)
మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 7 : 17 (ERVTE)
యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
మార్కు సువార్త 7 : 18 (ERVTE)
యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా!
మార్కు సువార్త 7 : 19 (ERVTE)
అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.) [PE][PS]
మార్కు సువార్త 7 : 20 (ERVTE)
ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి.
మార్కు సువార్త 7 : 21 (ERVTE)
ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం,
మార్కు సువార్త 7 : 22 (ERVTE)
లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. [✡ఉల్లేఖము: రోమా. 1:29, గలతీ. 5:19.]
మార్కు సువార్త 7 : 23 (ERVTE)
ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.” [PE][PS]
మార్కు సువార్త 7 : 24 (ERVTE)
{యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం} (మత్తయి 15:21-28) [PS] యేసు ఆ ప్రాంతం వదిలి తూరు [‡తూరు మరియు సీదోను అని అనేక ప్రతులలో ఉంది.] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు.
మార్కు సువార్త 7 : 25 (ERVTE)
ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది.
మార్కు సువార్త 7 : 26 (ERVTE)
ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది. [PE][PS]
మార్కు సువార్త 7 : 27 (ERVTE)
ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు” [§సమంజసం కాదు యూదులు ఇతర్లను కుక్కలుగా భావించే వాళ్ళు.] అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 7 : 28 (ERVTE)
“ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది. [PE][PS]
మార్కు సువార్త 7 : 29 (ERVTE)
అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు. [PE][PS]
మార్కు సువార్త 7 : 30 (ERVTE)
ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది. చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం [PS]
మార్కు సువార్త 7 : 31 (ERVTE)
ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు.
మార్కు సువార్త 7 : 32 (ERVTE)
అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు. [PE][PS]
మార్కు సువార్త 7 : 33 (ERVTE)
యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు.
మార్కు సువార్త 7 : 34 (ERVTE)
ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.)
మార్కు సువార్త 7 : 35 (ERVTE)
వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. [PE][PS]
మార్కు సువార్త 7 : 36 (ERVTE)
యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు.
మార్కు సువార్త 7 : 37 (ERVTE)
ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: