మత్తయి సువార్త 10 : 1 (ERVTE)
{యేసు అపోస్తలులను పంపటం} (మార్కు 3:13-19; 6:7-13; లూకా 6:12-16; 9:1-6) [PS] యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు.
మత్తయి సువార్త 10 : 2 (ERVTE)
ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి: సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు. అతని సోదరుడు అంద్రెయ. జెబెదయి కుమారుడు యాకోబు, యాకోబు సోదరుడు యోహాను.
మత్తయి సువార్త 10 : 3 (ERVTE)
ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, పన్నులు సేకరించే మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అని పిలువబడే లెబ్బయి,
మత్తయి సువార్త 10 : 4 (ERVTE)
కనానీయుడైన సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు. [PS]
మత్తయి సువార్త 10 : 5 (ERVTE)
ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి.
మత్తయి సువార్త 10 : 6 (ERVTE)
దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు.
మత్తయి సువార్త 10 : 7 (ERVTE)
వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి.
మత్తయి సువార్త 10 : 8 (ERVTE)
జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి.
మత్తయి సువార్త 10 : 9 (ERVTE)
బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి,
మత్తయి సువార్త 10 : 10 (ERVTE)
మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా! [PE][PS]
మత్తయి సువార్త 10 : 11 (ERVTE)
“మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి.
మత్తయి సువార్త 10 : 12 (ERVTE)
మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి.
మత్తయి సువార్త 10 : 13 (ERVTE)
ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది.
మత్తయి సువార్త 10 : 14 (ERVTE)
ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి.
మత్తయి సువార్త 10 : 15 (ERVTE)
ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది. [PE][PS]
మత్తయి సువార్త 10 : 16 (ERVTE)
{కష్టాలను గురించి యేసు హెచ్చరించటం} (మార్కు 13:9-13; లూకా 21:12-17) [PS] “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి.
మత్తయి సువార్త 10 : 17 (ERVTE)
కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు.
మత్తయి సువార్త 10 : 18 (ERVTE)
వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి.
మత్తయి సువార్త 10 : 19 (ERVTE)
వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు.
మత్తయి సువార్త 10 : 20 (ERVTE)
ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. [PE][PS]
మత్తయి సువార్త 10 : 21 (ERVTE)
“సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు.
మత్తయి సువార్త 10 : 22 (ERVTE)
ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు.
మత్తయి సువార్త 10 : 23 (ERVTE)
మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 10 : 24 (ERVTE)
“విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు.
మత్తయి సువార్త 10 : 25 (ERVTE)
విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు [*బయెల్జెబూలు అంటే సాతాను.] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా! దేవునికి భయపడుము, జనులకు కాదు (లూకా 12:2-7) [PE][PS]
మత్తయి సువార్త 10 : 26 (ERVTE)
“అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి.
మత్తయి సువార్త 10 : 27 (ERVTE)
నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి. [PE][PS]
మత్తయి సువార్త 10 : 28 (ERVTE)
“వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి.
మత్తయి సువార్త 10 : 29 (ERVTE)
ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు.
మత్తయి సువార్త 10 : 30 (ERVTE)
మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు.
మత్తయి సువార్త 10 : 31 (ERVTE)
అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు. [PE][PS]
మత్తయి సువార్త 10 : 32 (ERVTE)
{నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు} (లూకా 12:8-9) [PS] “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను.
మత్తయి సువార్త 10 : 33 (ERVTE)
కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను. [PE][PS]
మత్తయి సువార్త 10 : 34 (ERVTE)
{యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును} (లూకా 12:51-53; 14:26-27) [PS] “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను.
మత్తయి సువార్త 10 : 35 (ERVTE)
(35-36) ఎందుకంటే నేను, ‘తండ్రి కుమార్ల మధ్య, [QBR2] తల్లీ కూతుర్ల మధ్య, [QBR] అత్తా కోడళ్ళ మధ్య, [QBR2] విరోధం కలిగించాలని వచ్చాను. [QBR] ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’ మీకా 7:6] [PS]
మత్తయి సువార్త 10 : 36 (ERVTE)
మత్తయి సువార్త 10 : 37 (ERVTE)
“తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు.
మత్తయి సువార్త 10 : 38 (ERVTE)
నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు.
మత్తయి సువార్త 10 : 39 (ERVTE)
జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు. [PE][PS]
మత్తయి సువార్త 10 : 40 (ERVTE)
{నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును} (మార్కు 9:41) [PS] “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
మత్తయి సువార్త 10 : 41 (ERVTE)
ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు.
మత్తయి సువార్త 10 : 42 (ERVTE)
మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

BG:

Opacity:

Color:


Size:


Font: