మత్తయి సువార్త 11 : 1 (ERVTE)
{యోహాను అడగటానికి పంపిన ప్రశ్న} (లూకా 7:18-35) [PS] యేసు తన పన్నెండుగురి శిష్యులకు వాళ్ళు చెయ్యవలసిన వాటిని గురించి చెప్పటం ముగించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి, ప్రకటించటానికి వెళ్ళాడు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 2 (ERVTE)
కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి,
మత్తయి సువార్త 11 : 3 (ERVTE)
వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 4 (ERVTE)
యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి.
మత్తయి సువార్త 11 : 5 (ERVTE)
గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి.
మత్తయి సువార్త 11 : 6 (ERVTE)
నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 7 (ERVTE)
యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా?
మత్తయి సువార్త 11 : 8 (ERVTE)
మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు.
మత్తయి సువార్త 11 : 9 (ERVTE)
మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.
మత్తయి సువార్త 11 : 10 (ERVTE)
అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: ‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, [QBR] అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’ మలాకీ 3:1 [PS]
మత్తయి సువార్త 11 : 11 (ERVTE)
“ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు.
మత్తయి సువార్త 11 : 12 (ERVTE)
బాప్తీస్మము ఇచ్చే యోహాను కాలం నుండి, నేటివరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు.
మత్తయి సువార్త 11 : 13 (ERVTE)
యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది.
మత్తయి సువార్త 11 : 14 (ERVTE)
ఆ యోహానే రానున్న ఏలీయా. ఇష్టముంటే అంగీకరించండి.
మత్తయి సువార్త 11 : 15 (ERVTE)
ఇష్టమున్నవాడు వింటాడు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 16 (ERVTE)
“ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకొంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు:
మత్తయి సువార్త 11 : 17 (ERVTE)
‘మేము పిల్లనగ్రోవి వూదాము; [QBR2] కాని మీరు నాట్యం చెయ్యలేదు, [QBR] మేము విషాదగీతం పాడాము, [QBR2] కాని మీరు దుఃఖించలేదు.’
మత్తయి సువార్త 11 : 18 (ERVTE)
ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. కాని అతనిలో దయ్యం ఉందన్నారు.
మత్తయి సువార్త 11 : 19 (ERVTE)
మనుష్య కుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు. కాని వాళ్ళు, ‘ఇదిగో తిండిపోతు, త్రాగుపోతు. ఇతను పన్నులు సేకరించే వాళ్ళకు, పాపులకు మిత్రుడు’ అని అన్నారు. జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది.” [PE][PS]
మత్తయి సువార్త 11 : 20 (ERVTE)
{యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం} (లూకా 10:13-15) [PS] ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు వాటిని విమర్శించాడు.
మత్తయి సువార్త 11 : 21 (ERVTE)
“అయ్యో! కొరాజీనా పట్టణమా! అయ్యో! బేత్సయిదా నగరమా! నేను మీలో చేసిన అద్భుతాలను తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టలు కట్టుకొని, బూడిదరాసుకొని మారుమనస్సు పొంది ఉండే వాళ్ళు.
మత్తయి సువార్త 11 : 22 (ERVTE)
కానీ, నేను చెప్పేదేమిటంటే తీర్పు చెప్పేరోజున తూరు, సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 23 (ERVTE)
“ఇక, ఓ కపెర్నహూము నగరమా! నీవు ఆకాశానికి ఎక్కుతాననుకొన్నావా? అలా జరుగదు! నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహాత్యాలు సోదొమ నగరంలో చేసివుంటే అది ఈనాటికీ నిలిచి ఉండేది.
మత్తయి సువార్త 11 : 24 (ERVTE)
కాని నేను మీకు చెప్పేదేమంటే తీర్పుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.” [PE][PS]
మత్తయి సువార్త 11 : 25 (ERVTE)
{అలసిన వాళ్ళకు విశ్రాంతి} (లూకా 10:21-22) [PS] ఆ సమయంలో యేసు యింకా ఈ విధంగా అన్నాడు, “తండ్రీ! ఆకాశానికి భూలోకానికి ప్రభువైన నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నీవు వీటిని తెలివిగల వాళ్ళ నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్న పిల్లలకు తెలియ జేసావు.
మత్తయి సువార్త 11 : 26 (ERVTE)
ఔను తండ్రీ! నీవీలాగు చేయటం నీకిష్టమయింది. [PE][PS]
మత్తయి సువార్త 11 : 27 (ERVTE)
“నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి తప్ప నాగురించి ఎవ్వరికి తెలియదు. నాకును, నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్న వాళ్ళకును తప్ప, తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. [PE][PS]
మత్తయి సువార్త 11 : 28 (ERVTE)
“బరువు మోస్తూ అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను.
మత్తయి సువార్త 11 : 29 (ERVTE)
నేనిచ్చిన కాడిని మోసి, నా నుండి నేర్చుకోండి. నేను సాత్వికుడను. నేను దీనుడను.
మత్తయి సువార్త 11 : 30 (ERVTE)
నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: