మత్తయి సువార్త 12 : 1 (ERVTE)
{యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు} [PS] ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు.
మత్తయి సువార్త 12 : 2 (ERVTE)
పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 3 (ERVTE)
(3-4) యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు.
మత్తయి సువార్త 12 : 4 (ERVTE)
మత్తయి సువార్త 12 : 5 (ERVTE)
అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు.
మత్తయి సువార్త 12 : 6 (ERVTE)
నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
మత్తయి సువార్త 12 : 7 (ERVTE)
‘నాకు దయకావాలి, బలికాదు’ [✡ఉల్లేఖము: హొషేయ 6:6.] అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 8 (ERVTE)
“విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 9 (ERVTE)
{విశ్రాంతి రోజు యేసు నయం చేయటం} (మార్కు 3:1-6; లూకా 6:6-11) [PS] ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు.
మత్తయి సువార్త 12 : 10 (ERVTE)
అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 11 (ERVTE)
ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా?
మత్తయి సువార్త 12 : 12 (ERVTE)
మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 13 (ERVTE)
అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది.
మత్తయి సువార్త 12 : 14 (ERVTE)
కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు. [PS]
మత్తయి సువార్త 12 : 15 (ERVTE)
{యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు} [PS] యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు.
మత్తయి సువార్త 12 : 16 (ERVTE)
తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
మత్తయి సువార్త 12 : 17 (ERVTE)
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
మత్తయి సువార్త 12 : 18 (ERVTE)
“ఆయన నేనెన్నుకున్న [QBR2] నా సేవకుడు! [QBR] ఆయన పట్ల నాకు ప్రేమవుంది. [QBR2] ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. [QBR] నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. [QBR2] ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు. [QBR]
మత్తయి సువార్త 12 : 19 (ERVTE)
ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, [QBR2] ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు. [QBR]
మత్తయి సువార్త 12 : 20 (ERVTE)
న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. [QBR2] ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు. [QBR]
మత్తయి సువార్త 12 : 21 (ERVTE)
ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.” యెషయా 42:1-4] [PE][PS]
మత్తయి సువార్త 12 : 22 (ERVTE)
{యేసుని శక్తి దేవునినుండి వచ్చినది} (మార్కు 3:20-30; లూకా 11:14-23; 12:10) [PS] ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి.
మత్తయి సువార్త 12 : 23 (ERVTE)
ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 24 (ERVTE)
పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 25 (ERVTE)
వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది.
మత్తయి సువార్త 12 : 26 (ERVTE)
సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది?
మత్తయి సువార్త 12 : 27 (ERVTE)
నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు.
మత్తయి సువార్త 12 : 28 (ERVTE)
ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా!
మత్తయి సువార్త 12 : 29 (ERVTE)
అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు.
మత్తయి సువార్త 12 : 30 (ERVTE)
నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 31 (ERVTE)
“అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు.
మత్తయి సువార్త 12 : 32 (ERVTE)
మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 33 (ERVTE)
{నీవు చేయునది నీవేమైయున్నావని చూపుతుంది} (లూకా 6:43-45;) [PS] “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది.
మత్తయి సువార్త 12 : 34 (ERVTE)
మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది.
మత్తయి సువార్త 12 : 35 (ERVTE)
మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది.
మత్తయి సువార్త 12 : 36 (ERVTE)
కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది.
మత్తయి సువార్త 12 : 37 (ERVTE)
ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 38 (ERVTE)
{కొందరు యేసు అధికారాన్ని సందేహించటం} (మార్కు 8:11-12; లూకా 11:29-32) [PS] ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 39 (ERVTE)
కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు.
మత్తయి సువార్త 12 : 40 (ERVTE)
ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు.
మత్తయి సువార్త 12 : 41 (ERVTE)
నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 42 (ERVTE)
“దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 43 (ERVTE)
{శూన్యమై ఉండుట అపాయము} (లూకా 11:24-26) [PS] “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు.
మత్తయి సువార్త 12 : 44 (ERVTE)
అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది.
మత్తయి సువార్త 12 : 45 (ERVTE)
అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 46 (ERVTE)
{యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు} (మార్కు 3:31-35; లూకా 8:19-21) [PS] యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు.
మత్తయి సువార్త 12 : 47 (ERVTE)
ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 12 : 48 (ERVTE)
యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు.
మత్తయి సువార్త 12 : 49 (ERVTE)
తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు.
మత్తయి సువార్త 12 : 50 (ERVTE)
ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

BG:

Opacity:

Color:


Size:


Font: