మత్తయి సువార్త 4 : 1 (ERVTE)
{యేసుకు కలిగిన పరీక్షలు} (మార్కు 1:12-13; లూకా 4:1-13) [PS] ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు.
మత్తయి సువార్త 4 : 2 (ERVTE)
అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
మత్తయి సువార్త 4 : 3 (ERVTE)
సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 4 (ERVTE)
యేసు సమాధానంగా, “ ‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు. [QBR2] కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’ ద్వితియోపదేశ 8:3 అని వ్రాసారు” అని అన్నాడు. [PS]
మత్తయి సువార్త 4 : 5 (ERVTE)
ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి,
మత్తయి సువార్త 4 : 6 (ERVTE)
“నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే, ‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. [QBR2] వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా [QBR] నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’ కీర్తన 91:11-12 అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 7 (ERVTE)
యేసు వానితో, “ ‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’ ద్వితీయోపదేశ 6:16 అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు. [PS]
మత్తయి సువార్త 4 : 8 (ERVTE)
సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి,
మత్తయి సువార్త 4 : 9 (ERVTE)
“నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 10 (ERVTE)
యేసు: “సైతానా! నా ముందునుండి వెళ్ళిపో! [QBR2] ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’ ద్వితీయోపదేశ 6:13 అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 11 (ERVTE)
అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 12 (ERVTE)
{గలిలయలో యేసుని సేవా ప్రారంభం} (మార్కు 1:14-15; లూకా 4:14-15) [PS] యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు.
మత్తయి సువార్త 4 : 13 (ERVTE)
ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది.
మత్తయి సువార్త 4 : 14 (ERVTE)
ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:
మత్తయి సువార్త 4 : 15 (ERVTE)
“జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా! [QBR2] సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా! [QBR2] యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా! [QBR]
మత్తయి సువార్త 4 : 16 (ERVTE)
చీకట్లో నివసిస్తున్న ప్రజలు [QBR2] గొప్ప వెలుగును చూసారు! [QBR] మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న [QBR2] ప్రజలపై వెలుగు ప్రకాశించింది.” యెషయా 9:1-2] [PS]
మత్తయి సువార్త 4 : 17 (ERVTE)
ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 18 (ERVTE)
{యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం} (మార్కు 1:16-20; లూకా 5:1-11) [PS] యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు.
మత్తయి సువార్త 4 : 19 (ERVTE)
యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు.
మత్తయి సువార్త 4 : 20 (ERVTE)
వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 21 (ERVTE)
యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు.
మత్తయి సువార్త 4 : 22 (ERVTE)
వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. [PE][PS]
మత్తయి సువార్త 4 : 23 (ERVTE)
{యేసు బోధించి రోగులను నయం చేయటం} (లూకా 6:17-19) [PS] యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు.
మత్తయి సువార్త 4 : 24 (ERVTE)
ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు.
మత్తయి సువార్త 4 : 25 (ERVTE)
గలిలయ నుండి, దెకపొలి [*దెకపొలి అంటే పది పట్టణాలు.] నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: