మత్తయి సువార్త 6 : 1 (ERVTE)
{యేసు ఇచ్చుటను గురించి బోధించటం} [PS] “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు. [PE][PS]
మత్తయి సువార్త 6 : 2 (ERVTE)
“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది.
మత్తయి సువార్త 6 : 3 (ERVTE)
కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి.
మత్తయి సువార్త 6 : 4 (ERVTE)
అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 6 : 5 (ERVTE)
{యేసు ప్రార్థన గురించి బోధించటం} (లూకా 11:2-4) [PS] “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం – వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది.
మత్తయి సువార్త 6 : 6 (ERVTE)
మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 6 : 7 (ERVTE)
“అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు.
మత్తయి సువార్త 6 : 8 (ERVTE)
వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు.
మత్తయి సువార్త 6 : 9 (ERVTE)
కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, [QBR2] నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము. [QBR]
మత్తయి సువార్త 6 : 10 (ERVTE)
నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే [QBR2] ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. [QBR]
మత్తయి సువార్త 6 : 11 (ERVTE)
ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము. [QBR]
మత్తయి సువార్త 6 : 12 (ERVTE)
ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, [QBR2] మేము చేసిన పాపాలను కూడా క్షమించుము. [QBR]
మత్తయి సువార్త 6 : 13 (ERVTE)
మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. [QBR2] పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’ [*కొన్ని గ్రీకు ప్రతులలో, “ఎందుకంటే రాజ్యము, అధికారము, మహిమ చిరకాలము నీవే. ఆమెన్” అని చేర్చబడింది.]
మత్తయి సువార్త 6 : 14 (ERVTE)
ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు.
మత్తయి సువార్త 6 : 15 (ERVTE)
కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు. [PS]
మత్తయి సువార్త 6 : 16 (ERVTE)
{యేసు ఉపవాసమును గురించి బోధించటం} [PS] “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు.
మత్తయి సువార్త 6 : 17 (ERVTE)
మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి.
మత్తయి సువార్త 6 : 18 (ERVTE)
అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు. [PE][PS]
మత్తయి సువార్త 6 : 19 (ERVTE)
{నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు} (లూకా 12:33-34; 11:34-36; 16:13) [PS] “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు.
మత్తయి సువార్త 6 : 20 (ERVTE)
మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు.
మత్తయి సువార్త 6 : 21 (ERVTE)
మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. [PE][PS]
మత్తయి సువార్త 6 : 22 (ERVTE)
“కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది.
మత్తయి సువార్త 6 : 23 (ERVTE)
మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. [PE][PS]
మత్తయి సువార్త 6 : 24 (ERVTE)
“ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం. [PE][PS]
మత్తయి సువార్త 6 : 25 (ERVTE)
{మొదట దేవుని రాజ్యం} (లూకా 12:22-34) [PS] “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా?
మత్తయి సువార్త 6 : 26 (ERVTE)
ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా!
మత్తయి సువార్త 6 : 27 (ERVTE)
చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా? [PE][PS]
మత్తయి సువార్త 6 : 28 (ERVTE)
“మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు.
మత్తయి సువార్త 6 : 29 (ERVTE)
అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు.
మత్తయి సువార్త 6 : 30 (ERVTE)
ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు. [PE][PS]
మత్తయి సువార్త 6 : 31 (ERVTE)
“ ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి.
మత్తయి సువార్త 6 : 32 (ERVTE)
యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు.
మత్తయి సువార్త 6 : 33 (ERVTE)
కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు.
మత్తయి సువార్త 6 : 34 (ERVTE)
రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: