మత్తయి సువార్త 9 : 1 (ERVTE)
{యేసు పక్షవాత రోగిని నయం చేయటం} (మార్కు 2:1-12 లూకా 5:17-26) [PS] యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు.
మత్తయి సువార్త 9 : 2 (ERVTE)
కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 3 (ERVTE)
ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 4 (ERVTE)
వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు?
మత్తయి సువార్త 9 : 5 (ERVTE)
‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా?
మత్తయి సువార్త 9 : 6 (ERVTE)
పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 7 (ERVTE)
పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు.
మత్తయి సువార్త 9 : 8 (ERVTE)
ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 9 (ERVTE)
{మత్తయిని పిలవటం} (మార్కు 2:13-17; లూకా 5:27-32) [PS] యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 10 (ERVTE)
యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు.
మత్తయి సువార్త 9 : 11 (ERVTE)
పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 12 (ERVTE)
యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది.
మత్తయి సువార్త 9 : 13 (ERVTE)
‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’ [✡ఉల్లేఖము: హోషేయ 6:6.] అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 14 (ERVTE)
{యేసు ఇతర మతనాయకులవలె కాదు} (మార్కు 2:18-22; లూకా 5:33-39) [PS] ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 15 (ERVTE)
యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 16 (ERVTE)
“పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది.
మత్తయి సువార్త 9 : 17 (ERVTE)
అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు. యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం (మార్కు 5:21-43; లూకా 8:40-56) [PE][PS]
మత్తయి సువార్త 9 : 18 (ERVTE)
యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 19 (ERVTE)
యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 20 (ERVTE)
వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది.
మత్తయి సువార్త 9 : 21 (ERVTE)
ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది. [PE][PS]
మత్తయి సువార్త 9 : 22 (ERVTE)
యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 23 (ERVTE)
యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు.
మత్తయి సువార్త 9 : 24 (ERVTE)
వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు.
మత్తయి సువార్త 9 : 25 (ERVTE)
ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది.
మత్తయి సువార్త 9 : 26 (ERVTE)
ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. [PS]
మత్తయి సువార్త 9 : 27 (ERVTE)
{ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం} [PS] యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 28 (ERVTE)
యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 29 (ERVTE)
అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు.
మత్తయి సువార్త 9 : 30 (ERVTE)
వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు.
మత్తయి సువార్త 9 : 31 (ERVTE)
కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 32 (ERVTE)
వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు.
మత్తయి సువార్త 9 : 33 (ERVTE)
యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు. [PE][PS]
మత్తయి సువార్త 9 : 34 (ERVTE)
కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు. [PS]
మత్తయి సువార్త 9 : 35 (ERVTE)
{కొద్దిమంది పనివాళ్ళు} [PS] యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, బాధల్ని నయం చేసాడు.
మత్తయి సువార్త 9 : 36 (ERVTE)
ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లా అలసిపోయి, చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలి పడ్డాడు.
మత్తయి సువార్త 9 : 37 (ERVTE)
ఆ తర్వాత తన శిష్యులతో, “పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా ఉన్నారు.
మత్తయి సువార్త 9 : 38 (ERVTE)
పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: