సంఖ్యాకాండము 29 : 1 (ERVTE)
{బూరల పండుగ} [PS] “ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు.
సంఖ్యాకాండము 29 : 2 (ERVTE)
దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 3 (ERVTE)
కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును,
సంఖ్యాకాండము 29 : 4 (ERVTE)
ఏడు గర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 5 (ERVTE)
మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి.
సంఖ్యాకాండము 29 : 6 (ERVTE)
నెలపొడుపు [*నెలపొడుపు యూదుల నెలలో మొదటి దినం. ఇది ప్రత్యేక ఆరాధనా దినం.] బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అని అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. [PS]
సంఖ్యాకాండము 29 : 7 (ERVTE)
{ప్రాయశ్చిత్త దినం} [PS] “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు.
సంఖ్యాకాండము 29 : 8 (ERVTE)
దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 9 (ERVTE)
ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను,
సంఖ్యాకాండము 29 : 10 (ERVTE)
ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 11 (ERVTE)
ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం. [PS]
సంఖ్యాకాండము 29 : 12 (ERVTE)
{పర్ణశాలల పండుగ} [PS] “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.
సంఖ్యాకాండము 29 : 13 (ERVTE)
దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 14 (ERVTE)
పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,
సంఖ్యాకాండము 29 : 15 (ERVTE)
పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 16 (ERVTE)
ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 17 (ERVTE)
“ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 18 (ERVTE)
కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 19 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 20 (ERVTE)
“ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 21 (ERVTE)
కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 22 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. రోజువారి బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 23 (ERVTE)
“ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 24 (ERVTE)
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 25 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 26 (ERVTE)
“ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 27 (ERVTE)
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 28 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ సానార్పణకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 29 (ERVTE)
“ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 30 (ERVTE)
కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 31 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 32 (ERVTE)
“ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 33 (ERVTE)
కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 34 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 35 (ERVTE)
“ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.
సంఖ్యాకాండము 29 : 36 (ERVTE)
మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 37 (ERVTE)
కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
సంఖ్యాకాండము 29 : 38 (ERVTE)
పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినము ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం. [PE][PS]
సంఖ్యాకాండము 29 : 39 (ERVTE)
“ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.” [PE][PS]
సంఖ్యాకాండము 29 : 40 (ERVTE)
యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: