సంఖ్యాకాండము 34 : 1 (ERVTE)
మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
సంఖ్యాకాండము 34 : 2 (ERVTE)
“ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు.
సంఖ్యాకాండము 34 : 3 (ERVTE)
దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది.
సంఖ్యాకాండము 34 : 4 (ERVTE)
అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది.
సంఖ్యాకాండము 34 : 5 (ERVTE)
అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది.
సంఖ్యాకాండము 34 : 6 (ERVTE)
మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం.
సంఖ్యాకాండము 34 : 7 (ERVTE)
మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.)
సంఖ్యాకాండము 34 : 8 (ERVTE)
హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది.
సంఖ్యాకాండము 34 : 9 (ERVTE)
తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు.
సంఖ్యాకాండము 34 : 10 (ERVTE)
మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది.
సంఖ్యాకాండము 34 : 11 (ERVTE)
షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది.
సంఖ్యాకాండము 34 : 12 (ERVTE)
తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.” [PE][PS]
సంఖ్యాకాండము 34 : 13 (ERVTE)
కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి.
సంఖ్యాకాండము 34 : 14 (ERVTE)
రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు.
సంఖ్యాకాండము 34 : 15 (ERVTE)
ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.” [PE][PS]
సంఖ్యాకాండము 34 : 16 (ERVTE)
అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
సంఖ్యాకాండము 34 : 17 (ERVTE)
“దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు
సంఖ్యాకాండము 34 : 18 (ERVTE)
అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు.
సంఖ్యాకాండము 34 : 19 (ERVTE)
ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి — యెపున్నె కుమారుడు కాలేబు;
సంఖ్యాకాండము 34 : 20 (ERVTE)
షిమ్యోను వంశంనుండి — అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
సంఖ్యాకాండము 34 : 21 (ERVTE)
బెన్యామీను వంశంనుండి — కిస్లోను కుమారుడు ఎలీదాదు
సంఖ్యాకాండము 34 : 22 (ERVTE)
దాను వంశంనుండి — యొగ్లి కుమారుడు బుక్కి
సంఖ్యాకాండము 34 : 23 (ERVTE)
మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు
సంఖ్యాకాండము 34 : 24 (ERVTE)
ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి — షిఫ్తాను కుమారుడు కెమూయేలు
సంఖ్యాకాండము 34 : 25 (ERVTE)
జెబూలూను వంశంనుండి — పర్నాకు కుమారుడు ఎలీషాపాను
సంఖ్యాకాండము 34 : 26 (ERVTE)
ఇశ్శాఖారు వంశంనుండి — అజ్ఞాను కుమారుడు పల్తీయేలు
సంఖ్యాకాండము 34 : 27 (ERVTE)
ఆషేరు వంశంనుండి — షెలోమి కుమారుడు అహీహోదు
సంఖ్యాకాండము 34 : 28 (ERVTE)
నఫ్తాలి వంశంనుండి — అమ్మీహోదు కుమారుడు పెదహేలు.” [PS]
సంఖ్యాకాండము 34 : 29 (ERVTE)
ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు. [PE]
❮
❯