సంఖ్యాకాండము 36 : 1 (ERVTE)
{సెలోపెహదు కుమార్తెల భూమి} [PS] యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు.
సంఖ్యాకాండము 36 : 2 (ERVTE)
వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యోహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహదు భూమిని అతడు కుమార్తెలకు ఇవ్వవలెనని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహదు మా సోదరుడు.
సంఖ్యాకాండము 36 : 3 (ERVTE)
ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసు కుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టు కుంటామా?
సంఖ్యాకాండము 36 : 4 (ERVTE)
ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో, సెలోపెహదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టు కుంటుంది కదా?” [PE][PS]
సంఖ్యాకాండము 36 : 5 (ERVTE)
మోషే ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ యోహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు.
సంఖ్యాకాండము 36 : 6 (ERVTE)
ఇది సెలోపెహదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి.
సంఖ్యాకాండము 36 : 7 (ERVTE)
ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
సంఖ్యాకాండము 36 : 8 (ERVTE)
ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
సంఖ్యాకాండము 36 : 9 (ERVTE)
కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.” [PE][PS]
సంఖ్యాకాండము 36 : 10 (ERVTE)
మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహదు కుమార్తెలు విధేయులయ్యారు.
సంఖ్యాకాండము 36 : 11 (ERVTE)
అందుచేత సెలోపెహదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్గా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు.
సంఖ్యాకాండము 36 : 12 (ERVTE)
వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారు భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందినది. [PE][PS]
సంఖ్యాకాండము 36 : 13 (ERVTE)
కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠయోర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: