సామెతలు 12 : 1 (ERVTE)
ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు. [PE][PS]
సామెతలు 12 : 2 (ERVTE)
మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుని దోషిగా యెహోవా తీర్చు చెబుతాడు. [PE][PS]
సామెతలు 12 : 3 (ERVTE)
దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు. [PE][PS]
సామెతలు 12 : 4 (ERVTE)
మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది. [PE][PS]
సామెతలు 12 : 5 (ERVTE)
మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు. [PE][PS]
సామెతలు 12 : 6 (ERVTE)
దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి. [PE][PS]
సామెతలు 12 : 7 (ERVTE)
దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు. [PE][PS]
సామెతలు 12 : 8 (ERVTE)
జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు. [PE][PS]
సామెతలు 12 : 9 (ERVTE)
భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు. [PE][PS]
సామెతలు 12 : 10 (ERVTE)
మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు. [PE][PS]
సామెతలు 12 : 11 (ERVTE)
తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు. [PE][PS]
సామెతలు 12 : 12 (ERVTE)
దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కానీ మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొ చ్చుకొనిపోయే బలం ఉంటుంది. [PE][PS]
సామెతలు 12 : 13 (ERVTE)
దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కానీ మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు. [PE][PS]
సామెతలు 12 : 14 (ERVTE)
ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది. [PE][PS]
సామెతలు 12 : 15 (ERVTE)
బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కానీ జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు. [PE][PS]
సామెతలు 12 : 16 (ERVTE)
బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు. [PE][PS]
సామెతలు 12 : 17 (ERVTE)
ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కానీ ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది. [PE][PS]
సామెతలు 12 : 18 (ERVTE)
ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును. [PE][PS]
సామెతలు 12 : 19 (ERVTE)
ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది. [PE][PS]
సామెతలు 12 : 20 (ERVTE)
దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు. [PE][PS]
సామెతలు 12 : 21 (ERVTE)
మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు.కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి. [PE][PS]
సామెతలు 12 : 22 (ERVTE)
అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం. [PE][PS]
సామెతలు 12 : 23 (ERVTE)
చురుకైనవాడు తనకు తెలిసిన అన్నీ విషయాలూ చెప్పడు. కానీ బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు. [PE][PS]
సామెతలు 12 : 24 (ERVTE)
కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది. [PE][PS]
సామెతలు 12 : 25 (ERVTE)
చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు. [PE][PS]
సామెతలు 12 : 26 (ERVTE)
మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి. [PE][PS]
సామెతలు 12 : 27 (ERVTE)
బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కానీ కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి. [PE][PS]
సామెతలు 12 : 28 (ERVTE)
నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: