సామెతలు 17 : 1 (ERVTE)
ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోంచేయటానికి ఒక ఎండిపోయన రొట్టెముక్క ఉంటే చాలు. [PE][PS]
సామెతలు 17 : 2 (ERVTE)
యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు. [PE][PS]
సామెతలు 17 : 3 (ERVTE)
బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా. [PE][PS]
సామెతలు 17 : 4 (ERVTE)
దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గుపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు. [PE][PS]
సామెతలు 17 : 5 (ERVTE)
కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు. [PE][PS]
సామెతలు 17 : 6 (ERVTE)
మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు. [PE][PS]
సామెతలు 17 : 7 (ERVTE)
ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు. [PE][PS]
సామెతలు 17 : 8 (ERVTE)
లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు. [PE][PS]
సామెతలు 17 : 9 (ERVTE)
నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కానీ అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది. [PE][PS]
సామెతలు 17 : 10 (ERVTE)
తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కానీ బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. [PE][PS]
సామెతలు 17 : 11 (ERVTE)
దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. [PE][PS]
సామెతలు 17 : 12 (ERVTE)
ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు. [PE][PS]
సామెతలు 17 : 13 (ERVTE)
నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. [PE][PS]
సామెతలు 17 : 14 (ERVTE)
నీవు వాదం మొదలు పెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి. [PE][PS]
సామెతలు 17 : 15 (ERVTE)
ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం. [PE][PS]
సామెతలు 17 : 16 (ERVTE)
బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు. [PE][PS]
సామెతలు 17 : 17 (ERVTE)
స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు. [PE][PS]
సామెతలు 17 : 18 (ERVTE)
మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. [PE][PS]
సామెతలు 17 : 19 (ERVTE)
జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. [PE][PS]
సామెతలు 17 : 20 (ERVTE)
దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి. [PE][PS]
సామెతలు 17 : 21 (ERVTE)
తెలివితక్కువ కుమారుడున్నా తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు. [PE][PS]
సామెతలు 17 : 22 (ERVTE)
సంతోషం ఒక మంచి మందులాంటిది. కానీ దు:ఖం ఒక రోగంలాంటిది. [PE][PS]
సామెతలు 17 : 23 (ERVTE)
దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు. [PE][PS]
సామెతలు 17 : 24 (ERVTE)
జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు. [PE][PS]
సామెతలు 17 : 25 (ERVTE)
తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు:ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు. [PE][PS]
సామెతలు 17 : 26 (ERVTE)
ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు. [PE][PS]
సామెతలు 17 : 27 (ERVTE)
జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించు కోడు. [PE][PS]
సామెతలు 17 : 28 (ERVTE)
బుద్ధిహీనుడు కూడా నేమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: