సామెతలు 18 : 1 (ERVTE)
ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించు కుంటాడు [PE][PS]
సామెతలు 18 : 2 (ERVTE)
బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు. [PE][PS]
సామెతలు 18 : 3 (ERVTE)
ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు. [PE][PS]
సామెతలు 18 : 4 (ERVTE)
ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును. [PE][PS]
సామెతలు 18 : 5 (ERVTE)
ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు.అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు. [PE][PS]
సామెతలు 18 : 6 (ERVTE)
బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును. [PE][PS]
సామెతలు 18 : 7 (ERVTE)
బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి. [PE][PS]
సామెతలు 18 : 8 (ERVTE)
మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతోన్న మంచి భోజనంలా ఉంటాయి. [PE][PS]
సామెతలు 18 : 9 (ERVTE)
బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. [PE][PS]
సామెతలు 18 : 10 (ERVTE)
యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు. [PE][PS]
సామెతలు 18 : 11 (ERVTE)
ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు. [PE][PS]
సామెతలు 18 : 12 (ERVTE)
ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు. [PE][PS]
సామెతలు 18 : 13 (ERVTE)
ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు. [PE][PS]
సామెతలు 18 : 14 (ERVTE)
ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కానీ ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా పదలు కొన్నట్టే! [PE][PS]
సామెతలు 18 : 15 (ERVTE)
జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు. [PE][PS]
సామెతలు 18 : 16 (ERVTE)
ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు. [PE][PS]
సామెతలు 18 : 17 (ERVTE)
ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. [PE][PS]
సామెతలు 18 : 18 (ERVTE)
ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి. [PE][PS]
సామెతలు 18 : 19 (ERVTE)
నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి. [PE][PS]
సామెతలు 18 : 20 (ERVTE)
నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు. [PE][PS]
సామెతలు 18 : 21 (ERVTE)
జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును. [PE][PS]
సామెతలు 18 : 22 (ERVTE)
నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది నట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం. [PE][PS]
సామెతలు 18 : 23 (ERVTE)
పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పవచ్చు. [PE][PS]
సామెతలు 18 : 24 (ERVTE)
ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: