సామెతలు 22 : 1 (ERVTE)
ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం. [PE][PS]
సామెతలు 22 : 2 (ERVTE)
ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందంనీ యెహోవాయే సృష్టించాడు. [PE][PS]
సామెతలు 22 : 3 (ERVTE)
జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కానీ తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు. [PE][PS]
సామెతలు 22 : 4 (ERVTE)
యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిజజీవం ఉంటాయి. [PE][PS]
సామెతలు 22 : 5 (ERVTE)
దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు. [PE][PS]
సామెతలు 22 : 6 (ERVTE)
ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు. [PE][PS]
సామెతలు 22 : 7 (ERVTE)
పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చు కొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు. [PE][PS]
సామెతలు 22 : 8 (ERVTE)
కష్టాలను విస్తరించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు. [PE][PS]
సామెతలు 22 : 9 (ERVTE)
ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు. [PE][PS]
సామెతలు 22 : 10 (ERVTE)
ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి. [PE][PS]
సామెతలు 22 : 11 (ERVTE)
పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు. [PE][PS]
సామెతలు 22 : 12 (ERVTE)
యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కానీ ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు. [PE][PS]
సామెతలు 22 : 13 (ERVTE)
“నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహాం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు. [PE][PS]
సామెతలు 22 : 14 (ERVTE)
వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యలాంటిది. ఆ గొయ్యలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది. [PE][PS]
సామెతలు 22 : 15 (ERVTE)
పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కానీ నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు. [PE][PS]
సామెతలు 22 : 16 (ERVTE)
నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి. [PS]
సామెతలు 22 : 17 (ERVTE)
{ముప్పయి జ్ఞాన సూక్తులు} [PS] నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో.
సామెతలు 22 : 18 (ERVTE)
వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది. [PE][PS]
సామెతలు 22 : 19 (ERVTE)
ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను. [PE][PS]
సామెతలు 22 : 20 (ERVTE)
నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను.
సామెతలు 22 : 21 (ERVTE)
ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు. – 1 – [PS]
సామెతలు 22 : 22 (ERVTE)
పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కానీ అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు.
సామెతలు 22 : 23 (ERVTE)
యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసి కొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు. – 2 – [PS]
సామెతలు 22 : 24 (ERVTE)
త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు.
సామెతలు 22 : 25 (ERVTE)
నీవు వెళ్తే, నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి. – 3 – [PS]
సామెతలు 22 : 26 (ERVTE)
మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు.
సామెతలు 22 : 27 (ERVTE)
అతని అప్పు నీవు తీర్చలేక పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి? – 4 – [PS]
సామెతలు 22 : 28 (ERVTE)
నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు. – 5 – [PS]
సామెతలు 22 : 29 (ERVTE)
ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులు కాని వారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉర డదు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: