సామెతలు 24 : 1 (ERVTE)
దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు.
సామెతలు 24 : 2 (ERVTE)
కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే. – 20 – [PS]
సామెతలు 24 : 3 (ERVTE)
మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి.
సామెతలు 24 : 4 (ERVTE)
జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింప బడతాయి. – 21 – [PS]
సామెతలు 24 : 5 (ERVTE)
జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది.
సామెతలు 24 : 6 (ERVTE)
నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి. – 22 – [PS]
సామెతలు 24 : 7 (ERVTE)
బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు. – 23 – [PS]
సామెతలు 24 : 8 (ERVTE)
నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు.
సామెతలు 24 : 9 (ERVTE)
బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు. – 24 – [PS]
సామెతలు 24 : 10 (ERVTE)
కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే. – 25 – [PS]
సామెతలు 24 : 11 (ERVTE)
మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి.
సామెతలు 24 : 12 (ERVTE)
“ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు. – 26 – [PS]
సామెతలు 24 : 13 (ERVTE)
నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది.
సామెతలు 24 : 14 (ERVTE)
అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు. – 27 – [PS]
సామెతలు 24 : 15 (ERVTE)
మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేకవాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు.
సామెతలు 24 : 16 (ERVTE)
ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు. – 28 – [PS]
సామెతలు 24 : 17 (ERVTE)
నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు.
సామెతలు 24 : 18 (ERVTE)
నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు. – 29 – [PS]
సామెతలు 24 : 19 (ERVTE)
దుర్మార్గులను నీకు చింత కలిగించనీయకు.దుర్మార్గుల విషయమై అసూయపడకు.
సామెతలు 24 : 20 (ERVTE)
ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది. – 30 – [PS]
సామెతలు 24 : 21 (ERVTE)
నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు.
సామెతలు 24 : 22 (ERVTE)
ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయబడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత కష్టం కలిగించగలరో నీకు తెలియదు. [PS]
సామెతలు 24 : 23 (ERVTE)
{మరిన్ని జ్ఞాన సూక్తులు} [PS] ఇవి జ్ఞానుల మాటలు: [PE][PS] ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన ఆయన అతనిని బలపరచకూడదు.
సామెతలు 24 : 24 (ERVTE)
ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి.
సామెతలు 24 : 25 (ERVTE)
అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు. [PE][PS]
సామెతలు 24 : 26 (ERVTE)
నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. [PE][PS]
సామెతలు 24 : 27 (ERVTE)
నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో. [PE][PS]
సామెతలు 24 : 28 (ERVTE)
గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు, [PE][PS]
సామెతలు 24 : 29 (ERVTE)
“అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు. [PE][PS]
సామెతలు 24 : 30 (ERVTE)
ఒక సోమరివాని పొలం పక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను.
సామెతలు 24 : 31 (ERVTE)
ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడి పోతుంది.
సామెతలు 24 : 32 (ERVTE)
నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
సామెతలు 24 : 33 (ERVTE)
కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం.
సామెతలు 24 : 34 (ERVTE)
ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: