సామెతలు 8 : 1 (ERVTE)
జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! [QBR2] మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. [QBR]
సామెతలు 8 : 2 (ERVTE)
మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట [QBR2] కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి. [QBR]
సామెతలు 8 : 3 (ERVTE)
పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. [QBR2] తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
సామెతలు 8 : 4 (ERVTE)
జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని [QBR2] నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా. [QBR]
సామెతలు 8 : 5 (ERVTE)
మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. [QBR2] అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి. [QBR]
సామెతలు 8 : 6 (ERVTE)
వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. [QBR2] సరైన విషయాలు నేను మీకు చెబుతాను. [QBR]
సామెతలు 8 : 7 (ERVTE)
నా మాటలు సత్యం. [QBR2] చెడు అబద్ధాలు నాకు అసహ్యం. [QBR]
సామెతలు 8 : 8 (ERVTE)
నేను చెప్పే విషయాలు సరైనవి. [QBR2] నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు. [QBR]
సామెతలు 8 : 9 (ERVTE)
తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. [QBR2] తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు. [QBR]
సామెతలు 8 : 10 (ERVTE)
నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. [QBR2] ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది. [QBR]
సామెతలు 8 : 11 (ERVTE)
జ్ఞానము ముత్యాలకంటె విలువగలది. [QBR2] ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
సామెతలు 8 : 12 (ERVTE)
{జ్ఞానము కలిగి ఉండటం} [PS] “నేను జ్ఞానాన్ని, [QBR2] నేను మంచి తీర్పుతో జీవిస్తాను. [QBR2] తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు. [QBR]
సామెతలు 8 : 13 (ERVTE)
ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. [QBR2] నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. [QBR2] చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం. [QBR]
సామెతలు 8 : 14 (ERVTE)
కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. [QBR2] తెలివీ శక్తిని నేను వారికి ఇస్తాను! [QBR]
సామెతలు 8 : 15 (ERVTE)
రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. [QBR2] న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు. [QBR]
సామెతలు 8 : 16 (ERVTE)
భూమిమీద ప్రతీ మంచి పాలకుడూ తన కింద ఉన్న [QBR2] ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు. [QBR]
సామెతలు 8 : 17 (ERVTE)
నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. [QBR2] నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు. [QBR]
సామెతలు 8 : 18 (ERVTE)
నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. [QBR2] నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను. [QBR]
సామెతలు 8 : 19 (ERVTE)
నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. [QBR2] నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి. [QBR]
సామెతలు 8 : 20 (ERVTE)
నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. [QBR2] సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను. [QBR]
సామెతలు 8 : 21 (ERVTE)
నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. [QBR2] అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
సామెతలు 8 : 22 (ERVTE)
“ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట [QBR2] యెహోవాచేత చేయబడింది నేనే [QBR]
సామెతలు 8 : 23 (ERVTE)
నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. [QBR2] ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను. [QBR]
సామెతలు 8 : 24 (ERVTE)
నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. [QBR2] నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను. [QBR]
సామెతలు 8 : 25 (ERVTE)
నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను. [QBR2]
సామెతలు 8 : 26 (ERVTE)
యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. [QBR2] ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను. [QBR]
సామెతలు 8 : 27 (ERVTE)
యెహోవా ఆకాశాలను చేసినప్పుడు [QBR2] నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. [QBR2] యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, [QBR2] మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు [QBR2] నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. [QBR]
సామెతలు 8 : 28 (ERVTE)
ఆకాశంలో యెహోవా మేఘాలను [QBR2] ఉంచకముందే నేను పుట్టాను. [QBR2] మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు [QBR2] నేను అక్కడ ఉన్నాను. [QBR]
సామెతలు 8 : 29 (ERVTE)
సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు [QBR2] నేను అక్కడ ఉన్నాను. [QBR2] యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, [QBR2] భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను. [QBR]
సామెతలు 8 : 30 (ERVTE)
నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. [QBR2] ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. [QBR]
సామెతలు 8 : 31 (ERVTE)
యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. [QBR2] అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
సామెతలు 8 : 32 (ERVTE)
“పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. [QBR] మీరు నా మార్గాలు వెంబడిస్తే [QBR2] మీరు కూడా సంతోషంగా ఉండగలరు [QBR]
సామెతలు 8 : 33 (ERVTE)
నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. [QBR2] వినుటకు తిరస్కరించకుడి. [QBR]
సామెతలు 8 : 34 (ERVTE)
ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. [QBR2] అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు. [QBR]
సామెతలు 8 : 35 (ERVTE)
నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును [QBR2] యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును. [QBR]
సామెతలు 8 : 36 (ERVTE)
అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి [QBR2] తనకు తానే హాని చేసుకొనును. [QBR] నన్ను అసహ్యించు కొనువారు మరణమును ప్రేమించెదరు.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: