కీర్తనల గ్రంథము 105 : 1 (ERVTE)
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము. [QBR2] ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 2 (ERVTE)
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము. [QBR2] ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 3 (ERVTE)
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి ఆతిశయించు. [QBR2] యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 4 (ERVTE)
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. [QBR2] సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 5 (ERVTE)
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. [QBR2] ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 6 (ERVTE)
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు. [QBR2] దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 7 (ERVTE)
యెహోవా మన దేవుడు. [QBR2] యెహోవా సర్వలోకాన్నీ పాలిస్తాడు. [*యెహోవా… పాలిస్తాడు అక్షరార్థముగా “ఆయన ఆజ్ఞలు ప్రపంచమంతటిలో ఉన్నవి.”] [QBR]
కీర్తనల గ్రంథము 105 : 8 (ERVTE)
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి. [QBR2] 1,000 తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 9 (ERVTE)
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. [QBR2] ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 10 (ERVTE)
యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. [QBR2] ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 11 (ERVTE)
“నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.” [QBR2] అని దేవుడు చెప్పాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 12 (ERVTE)
అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. [QBR2] మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 13 (ERVTE)
దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి [QBR2] వారు ప్రయాణం చేసారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 14 (ERVTE)
కానీ యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు. [QBR2] వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 15 (ERVTE)
“నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు. [QBR2] నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 16 (ERVTE)
దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. [QBR2] ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 17 (ERVTE)
అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు. [QBR2] యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 18 (ERVTE)
యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. [QBR2] అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 19 (ERVTE)
యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు [QBR2] అతడు బానిసగా యోసేపు చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 20 (ERVTE)
కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు. [QBR2] అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 21 (ERVTE)
అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు. [QBR2] రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 22 (ERVTE)
యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు. [QBR2] పెద్ద మనుష్యులకు యోసేపు నేర్చించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 23 (ERVTE)
తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు. [QBR2] యాకోబు హాము దేశంలో [†హాము దేశం ఈజిప్టు వారు హాము వంశస్థులని బైబులు తెలియజేస్తుంది.] నివసించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 24 (ERVTE)
యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది. [QBR2] వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 25 (ERVTE)
కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు. [QBR2] ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 26 (ERVTE)
కనుక దేవుడు తన సేవకుడైన మోషేను, [QBR2] తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 27 (ERVTE)
హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి [QBR2] దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 28 (ERVTE)
దేవుడు కటిక చీకటిని పంపించాడు. [QBR2] కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 29 (ERVTE)
కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. [QBR2] వాళ్ల చేపలన్నీ చచ్చాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 30 (ERVTE)
ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. [QBR2] రాజు గదులలో కూడ కప్పలు ఉన్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 31 (ERVTE)
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు, [QBR2] దోమలు వచ్చాయి. [QBR2] అన్నిచోట్లా అవే ఉన్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 32 (ERVTE)
దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు. [QBR2] ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 33 (ERVTE)
ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు. [QBR2] వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 34 (ERVTE)
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు వచ్చాయి. [QBR2] అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 35 (ERVTE)
మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి. [QBR2] నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 36 (ERVTE)
అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్నీ దేవుడు చంపేశాడు. [QBR2] వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 37 (ERVTE)
అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు. [QBR2] వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు. [QBR2] దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 38 (ERVTE)
దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది. [QBR2] ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 39 (ERVTE)
దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు. [QBR2] రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 40 (ERVTE)
ప్రజలు భోజనం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. [QBR2] దేవుడ వారికి ఆకాశం నుండి సమృద్ధిగా రొట్టెను యిచ్చాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 41 (ERVTE)
దేవుడు బండను చిల్చగా నీళ్లు ఉబకుతూ వచ్చాయి. [QBR2] ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
కీర్తనల గ్రంథము 105 : 42 (ERVTE)
దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు. [QBR2] దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 43 (ERVTE)
దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. [QBR2] ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 44 (ERVTE)
అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. [QBR2] ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 45 (ERVTE)
దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు. [QBR2] వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు. యెహోవాను స్తుతించండి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: