కీర్తనల గ్రంథము 109 : 1 (ERVTE)
దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 2 (ERVTE)
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. [QBR2] నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబతున్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 3 (ERVTE)
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబతున్నారు. [QBR2] ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 4 (ERVTE)
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు. [QBR2] కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 5 (ERVTE)
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను. [QBR2] కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు. [QBR] నేను వారిని ప్రేమించాను. [QBR2] కాని వారు నన్ను ద్వేషించారు.
కీర్తనల గ్రంథము 109 : 6 (ERVTE)
నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము. [QBR2] వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 7 (ERVTE)
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము. [QBR2] నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 8 (ERVTE)
నా శత్రువును త్వరగా చావనీమ్ము. [QBR2] నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక! [QBR]
కీర్తనల గ్రంథము 109 : 9 (ERVTE)
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక! [QBR]
కీర్తనల గ్రంథము 109 : 10 (ERVTE)
వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక! [QBR]
కీర్తనల గ్రంథము 109 : 11 (ERVTE)
నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము. [QBR2] అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 12 (ERVTE)
నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. [QBR2] అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 13 (ERVTE)
నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. [QBR2] తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 14 (ERVTE)
నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను [QBR2] యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 15 (ERVTE)
ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. [QBR2] ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 16 (ERVTE)
ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు. [QBR2] అతడు ఎన్నడూ ఎవిరనీ ప్రేమించలేదు. [QBR2] అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టకరం చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 17 (ERVTE)
ప్రజలకు సంభవించే చెడు సంగతులు శాపము చూడటానికి ఆ దుర్మార్గులునికి ఎంతో ఇష్టం. [QBR2] కనుక ఆ చెడు సంగతులు అతనికే సభవించనిమ్ము. [QBR] ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు. [QBR2] కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 18 (ERVTE)
శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము. [QBR] దుర్మర్గులు తాగేమదుకు శాపాలే నీళ్లుగా నీళ్లుగా ఉండనిమ్ము [QBR2] శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 19 (ERVTE)
శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము. [QBR2] శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.
కీర్తనల గ్రంథము 109 : 20 (ERVTE)
నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. [QBR2] నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 21 (ERVTE)
యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు. [QBR2] నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 22 (ERVTE)
నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని, [QBR2] నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 23 (ERVTE)
దినాంతంలో దీర్గ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనుపిస్తుంది. [QBR2] ఎవరో నలిపివేసిని నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 24 (ERVTE)
నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి. [QBR2] నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 25 (ERVTE)
చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు. [QBR2] వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 26 (ERVTE)
దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము! [QBR2] నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 27 (ERVTE)
అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు. [QBR2] నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 28 (ERVTE)
ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు. [QBR2] వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము. [QBR2] అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 29 (ERVTE)
నా శత్రువులను ఇబ్బంది పెట్టుము! [QBR2] వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 30 (ERVTE)
యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. [QBR2] అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 109 : 31 (ERVTE)
ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు. [QBR2] వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: