కీర్తనల గ్రంథము 12 : 1 (ERVTE)
యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యులంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
కీర్తనల గ్రంథము 12 : 2 (ERVTE)
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
కీర్తనల గ్రంథము 12 : 3 (ERVTE)
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసి వేయాలి.
కీర్తనల గ్రంథము 12 : 4 (ERVTE)
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ ప్రజలు ఈ సంగతులు చెప్పుకొంటారు.
కీర్తనల గ్రంథము 12 : 5 (ERVTE)
కానీ యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు. కానీ ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”
కీర్తనల గ్రంథము 12 : 6 (ERVTE)
యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయ బడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.
కీర్తనల గ్రంథము 12 : 7 (ERVTE)
యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగానూ నీవు వారిని కాపాడుతావు.
కీర్తనల గ్రంథము 12 : 8 (ERVTE)
మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: