కీర్తనల గ్రంథము 122 : 1 (ERVTE)
“మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
కీర్తనల గ్రంథము 122 : 2 (ERVTE)
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కీర్తనల గ్రంథము 122 : 3 (ERVTE)
కొత్త యెరూషలేము ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
కీర్తనల గ్రంథము 122 : 4 (ERVTE)
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు. యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
కీర్తనల గ్రంథము 122 : 5 (ERVTE)
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది. దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
కీర్తనల గ్రంథము 122 : 6 (ERVTE)
యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “నిన్ను ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
కీర్తనల గ్రంథము 122 : 7 (ERVTE)
నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
కీర్తనల గ్రంథము 122 : 8 (ERVTE)
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
కీర్తనల గ్రంథము 122 : 9 (ERVTE)
[This verse may not be a part of this translation]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: