కీర్తనల గ్రంథము 127 : 1 (ERVTE)
ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసికొంటున్నట్టే.
కీర్తనల గ్రంథము 127 : 2 (ERVTE)
నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే నీవు నీ సమయం వృదా చేనుకొంటున్నట్టే. దేవుడు తనకి ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు.
కీర్తనల గ్రంథము 127 : 3 (ERVTE)
పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
కీర్తనల గ్రంథము 127 : 4 (ERVTE)
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటి వారు.
కీర్తనల గ్రంథము 127 : 5 (ERVTE)
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: