యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు. [QBR2] ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
కీర్తనల గ్రంథము 128 : 2 (ERVTE)
నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు. [QBR2] ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి. [QBR]
కీర్తనల గ్రంథము 128 : 3 (ERVTE)
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది. [QBR2] బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 128 : 4 (ERVTE)
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 128 : 5 (ERVTE)
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశీస్తున్నాను. [QBR2] నీవ నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 128 : 6 (ERVTE)
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను. ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక. [PE]