కీర్తనల గ్రంథము 13 : 1 (ERVTE)
యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు? నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా? నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
కీర్తనల గ్రంథము 13 : 2 (ERVTE)
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
కీర్తనల గ్రంథము 13 : 3 (ERVTE)
నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
కీర్తనల గ్రంథము 13 : 4 (ERVTE)
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు. నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
కీర్తనల గ్రంథము 13 : 5 (ERVTE)
యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను. నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
కీర్తనల గ్రంథము 13 : 6 (ERVTE)
యెహోవా నాకు మేలు కార్యాలు చేశాడు. కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: