కీర్తనల గ్రంథము 132 : 1 (ERVTE)
యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకోమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 2 (ERVTE)
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. [QBR2] ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దైవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 3 (ERVTE)
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను. [QBR2] నేను నా పడక మీద పండుకొనను, [QBR]
కీర్తనల గ్రంథము 132 : 4 (ERVTE)
నేను నిద్రపోను, [QBR2] నేను నా కండ్లకు విశ్రాంతి నివ్వను, [QBR]
కీర్తనల గ్రంథము 132 : 5 (ERVTE)
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను! [QBR2] ఇశ్రాయేలీయుల మహ శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
కీర్తనల గ్రంథము 132 : 6 (ERVTE)
ఎఫ్రాతాలో [*ఎఫ్రాతా దావీదు పుట్టిన బెత్లెహేం పట్టణం.] మేము దాని గూర్చి విన్నాం. [QBR2] ఒడంబడికపెట్టెను కిర్యత్యారీము [†కిర్యత్యారీము అరణ్యం అని అర్థం వచ్చే ఈ మాట ఈ పట్టణానికి పేరు.] దగ్గర మేము కనుగొన్నాము. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 7 (ERVTE)
మనం పవిత్ర గూడారానికి వెళ్దాం రండి. [QBR2] దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 8 (ERVTE)
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము. [QBR2] యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 9 (ERVTE)
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము. [QBR2] నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 10 (ERVTE)
నీ సేవకుడైన దావీదు కోసం [QBR2] నీవు ఏర్పరచు కొన్న రాజును నిరాకరించవద్దు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 11 (ERVTE)
యెహోవా దావీదుతో ఒక స్థిరప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు. [QBR2] దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 12 (ERVTE)
“దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే [QBR2] అప్పుడు నీ వర శంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యోహోవా చెప్పాడు.
కీర్తనల గ్రంథము 132 : 13 (ERVTE)
యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు. [QBR2] తన నివాసస్థలంగా దాన్ని కోరు కొనియున్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 14 (ERVTE)
యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం. [QBR2] నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 15 (ERVTE)
సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను. [QBR2] ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 16 (ERVTE)
యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను. [QBR2] మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 17 (ERVTE)
ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ములేచేలా చేస్తాను. [QBR2] నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 132 : 18 (ERVTE)
దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను. [QBR2] కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: