కీర్తనల గ్రంథము 135 : 1 (ERVTE)
యెహోవాను స్తుతించండి. [QBR2] యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 2 (ERVTE)
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! [QBR2] ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! [QBR]
కీర్తనల గ్రంథము 135 : 3 (ERVTE)
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. [QBR2] యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
కీర్తనల గ్రంథము 135 : 4 (ERVTE)
యెహోవా యాకోబును కోరుతున్నాడు. [QBR2] యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 5 (ERVTE)
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. [QBR2] మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు! [QBR]
కీర్తనల గ్రంథము 135 : 6 (ERVTE)
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, [QBR2] అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను కొంటే అది చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 7 (ERVTE)
భూమికి ప్తెగా మేఘాలను దెవుడు చేస్తాడు. [QBR2] మెరుపులను, వర్షాన్ని దెవుడు చేస్తాడు. [QBR2] దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 8 (ERVTE)
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 9 (ERVTE)
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు. [QBR2] ఫరోకు, అవి అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 10 (ERVTE)
దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. [QBR2] బలమైన రాజులను దేవుడు చంపేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 11 (ERVTE)
అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. [QBR2] బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు. [QBR2] కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 12 (ERVTE)
వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. [QBR2] దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
కీర్తనల గ్రంథము 135 : 13 (ERVTE)
యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. [QBR2] యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 14 (ERVTE)
యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. [QBR2] కాని తన సేవకుల యెడల దయ చూపించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 15 (ERVTE)
ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. [QBR2] వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 16 (ERVTE)
ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడలేవు. [QBR2] కళ్లు వున్నాయి కానీ అవి చూడలేవు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 17 (ERVTE)
ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. [QBR2] ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 18 (ERVTE)
మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. [QBR2] ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
కీర్తనల గ్రంథము 135 : 19 (ERVTE)
ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! [QBR2] అహరోను వంశమా, యెహోవాను స్తుతించు. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 20 (ERVTE)
లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! [QBR2] యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి. [QBR]
కీర్తనల గ్రంథము 135 : 21 (ERVTE)
సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, [QBR2] యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి! [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: