కీర్తనల గ్రంథము 136 : 1 (ERVTE)
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 2 (ERVTE)
దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 3 (ERVTE)
యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 4 (ERVTE)
ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 5 (ERVTE)
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 6 (ERVTE)
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 7 (ERVTE)
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 8 (ERVTE)
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 9 (ERVTE)
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని, నక్షత్రాలను చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 10 (ERVTE)
దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 11 (ERVTE)
దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 12 (ERVTE)
దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 13 (ERVTE)
దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 14 (ERVTE)
దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నుండి నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 15 (ERVTE)
దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 16 (ERVTE)
దేవుడు తన ప్రజలను ఉడారిలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 17 (ERVTE)
దేవుడ శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 18 (ERVTE)
దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 19 (ERVTE)
దేవుడు ఆమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 20 (ERVTE)
దేవుడు భాషాను రాజైన ఓగును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 21 (ERVTE)
దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 22 (ERVTE)
దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 23 (ERVTE)
దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 24 (ERVTE)
దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 25 (ERVTE)
దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 136 : 26 (ERVTE)
పరలోకపు దేవుని స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: