“దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. [QBR2] బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. [QBR2] వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
కీర్తనల గ్రంథము 14 : 2 (ERVTE)
పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. [QBR2] వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుని ప్రయత్నించాడు. [QBR2] ( వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.) [QBR]
కీర్తనల గ్రంథము 14 : 3 (ERVTE)
కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. [QBR2] మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. [QBR] కనీసం ఒక్క వ్యక్తి కూడా [QBR2] మంచి పనులు చేయలేదు.
కీర్తనల గ్రంథము 14 : 4 (ERVTE)
దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. [QBR2] ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. [QBR2] దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. [QBR2] ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 5 (ERVTE)
(5-6) దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. [QBR2] కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. [QBR] కానీ ఆ దుర్మార్గులు చాలా భయపడి పోయారు. [QBR2] ఎందుకంటే దేవుడు తనుమంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
కీర్తనల గ్రంథము 14 : 6 (ERVTE)
కీర్తనల గ్రంథము 14 : 7 (ERVTE)
సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? [QBR2] ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. [QBR] కానీ యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. [QBR2] ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు. [PE]