కీర్తనల గ్రంథము 144 : 1 (ERVTE)
యెహోవా నా దుర్గం [*దుర్గం దేవుడు క్షేమ స్థానం అని అర్థం.] యెహోవాను స్తుతించండి. [QBR2] యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు. [QBR] యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 2 (ERVTE)
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. [QBR2] పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. [QBR] యెహోవా నన్ను రక్షిస్తాడు, [QBR2] యెహోవా నా కేడెం. [QBR] నేను ఆయనను నమ్ముతాను. [QBR2] నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
కీర్తనల గ్రంథము 144 : 3 (ERVTE)
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? [QBR2] నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు? [QBR]
కీర్తనల గ్రంథము 144 : 4 (ERVTE)
మనిషి జీవితం గాలి బుడగలాంటిది. [QBR2] వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.
కీర్తనల గ్రంథము 144 : 5 (ERVTE)
యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము. [QBR2] పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 6 (ERVTE)
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. [QBR2] నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 7 (ERVTE)
యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము. [QBR2] ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము. [QBR2] ఇతరుల నుండి నన్ను రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 8 (ERVTE)
ఈ శత్రువులు అబద్ధీకులు. [QBR2] వారు అసత్య విషయాలు చెబుతారు.
కీర్తనల గ్రంథము 144 : 9 (ERVTE)
యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకర కార్యాలను గూర్చి నేను కొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము. [QBR2] పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 10 (ERVTE)
రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు. [QBR2] యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 11 (ERVTE)
ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము. [QBR2] ఈ శత్రువులు అబద్ధీకులు. [QBR2] వారు అసత్యాలు చెబుతారు.
కీర్తనల గ్రంథము 144 : 12 (ERVTE)
మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను. [QBR2] మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 144 : 13 (ERVTE)
మన ధ్యానపు కొట్టాలు అన్ని రకాల పంటలతో [QBR2] నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. [QBR] మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా పిల్లల్ని [QBR2] పెడతాయని నేను ఆశిస్తున్నాను. [QBR2]
కీర్తనల గ్రంథము 144 : 14 (ERVTE)
మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను. [QBR] శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను. [QBR2] మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను. [QBR] మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
కీర్తనల గ్రంథము 144 : 15 (ERVTE)
ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. [QBR2] యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: