కీర్తనల గ్రంథము 145 : 1 (ERVTE)
నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. [QBR2] నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 2 (ERVTE)
ప్రతిరోజూ నిన్న నేను స్తుతిస్తాను. [QBR2] ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 3 (ERVTE)
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు. [QBR2] ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 4 (ERVTE)
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు. [QBR2] నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 5 (ERVTE)
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. [QBR2] నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 6 (ERVTE)
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. [QBR2] నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 7 (ERVTE)
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. [QBR2] యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
కీర్తనల గ్రంథము 145 : 8 (ERVTE)
యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. [QBR2] యెహోవా సహనంగల వాడు, ప్రేమ పూర్ణుడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 9 (ERVTE)
యెహోవా, అందరి యెడలా మంచివాడు. [QBR2] దేవుడ చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 10 (ERVTE)
యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి. [QBR2] నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 11 (ERVTE)
ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు. [QBR2] నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 12 (ERVTE)
కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. [QBR2] మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 13 (ERVTE)
యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. [QBR2] నీవు శాశ్వతంగా పాలిస్తావు.
కీర్తనల గ్రంథము 145 : 14 (ERVTE)
పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. [QBR2] కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 15 (ERVTE)
యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం సీవైపు చూస్తాయి. [QBR2] సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 16 (ERVTE)
యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి, [QBR2] జీవిస్తున్న సకల ప్రాణులకూ వాటికి కావాల్సినవన్నీ యిస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 17 (ERVTE)
యెహోవా చేసే ప్రతీదీ మంచిది. [QBR2] యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమ చూపిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 18 (ERVTE)
యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. [QBR2] యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 19 (ERVTE)
ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు. [QBR2] యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. [QBR2] మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 20 (ERVTE)
యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు. [QBR2] దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 145 : 21 (ERVTE)
నేను యెహోవాను స్తుతిస్తాను! [QBR2] ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక! [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: