కీర్తనల గ్రంథము 149 : 1 (ERVTE)
యెహోవాను స్తుతించండి. [QBR] యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! [QBR2] ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి. [QBR]
కీర్తనల గ్రంథము 149 : 2 (ERVTE)
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. [QBR2] సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి. [QBR]
కీర్తనల గ్రంథము 149 : 3 (ERVTE)
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ [QBR2] నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి. [QBR]
కీర్తనల గ్రంథము 149 : 4 (ERVTE)
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. [QBR2] దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. [QBR2] ఆయన వారిని రక్షించాడు! [QBR]
కీర్తనల గ్రంథము 149 : 5 (ERVTE)
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. [QBR2] పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
కీర్తనల గ్రంథము 149 : 6 (ERVTE)
ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. [QBR2] ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని [QBR]
కీర్తనల గ్రంథము 149 : 7 (ERVTE)
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. [QBR2] వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. [QBR]
కీర్తనల గ్రంథము 149 : 8 (ERVTE)
ఆ రాజులకు, ప్రముఖులకు [QBR2] దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 149 : 9 (ERVTE)
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. [QBR2] దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి! [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: