కీర్తనల గ్రంథము 17 : 1 (ERVTE)
యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము. [QBR2] నా ప్రార్థనా గీతం వినుము. [QBR] యదార్థమైన నా ప్రార్థన వినుము. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 2 (ERVTE)
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది. [QBR2] నీవు సత్యాన్ని చూడగలవు. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 3 (ERVTE)
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు [QBR2] దాన్ని లోతుగా చూశావు. [QBR] రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు. [QBR2] నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తల పెట్టలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 4 (ERVTE)
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు [QBR2] నేను మానవ పరంగా సాధ్యమైనతం కష్టపడి ప్రయత్నించాను. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 5 (ERVTE)
నేను నీ మార్గాలు అనుసరించాను. [QBR2] నీ జీవిత విధానం నుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 6 (ERVTE)
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు. [QBR2] కనుక ఇప్పుడు నా మాట వినుము. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 7 (ERVTE)
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము. [QBR2] నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము. [QBR] నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 8 (ERVTE)
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. [QBR2] నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 9 (ERVTE)
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR] నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారి నుండి నన్ను కాపాడుము. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 10 (ERVTE)
ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు [QBR2] మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 11 (ERVTE)
ఆ మనుష్యులు నన్ను తరిమారు. [QBR2] ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు. [QBR] నన్ను నేలకు పడ గొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 17 : 12 (ERVTE)
చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు. [QBR2] వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
కీర్తనల గ్రంథము 17 : 13 (ERVTE)
యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపొయేటట్టుగా చేయుము. [QBR2] నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. [QBR2]
కీర్తనల గ్రంథము 17 : 14 (ERVTE)
యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవ ప్రజల దేశంలో నుండి ఆ దుర్మార్గులను తొలగించుము. [QBR] యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి వాళ్ల కడుపులను నింపుము. [QBR2] ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 17 : 15 (ERVTE)
న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. [QBR2] మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: