కీర్తనల గ్రంథము 19 : 1 (ERVTE)
ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి. [QBR2] యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 2 (ERVTE)
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది. [QBR2] ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 3 (ERVTE)
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు. [QBR2] మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 4 (ERVTE)
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది. [QBR2] వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి. అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది. [QBR2]
కీర్తనల గ్రంథము 19 : 5 (ERVTE)
తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు. [QBR] పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు [QBR2] ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 6 (ERVTE)
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు, [QBR2] మరియు ఆవలి దిశకు అది పరిగెడుతుంది. [QBR2] దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 19 : 7 (ERVTE)
యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. [QBR2] అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి. [QBR] యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది. [QBR2] జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 8 (ERVTE)
యెహోవా చట్టాలు సరియైనవి. [QBR2] అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. [QBR] యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. [QBR2] ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
కీర్తనల గ్రంథము 19 : 9 (ERVTE)
యెహోవాను ఆరాధించుట మంచిది. [QBR2] అది నిరంతరము నిలుస్తుంది. [QBR] యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. [QBR2] అవి సంపూర్ణంగా సరియైనవి. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 10 (ERVTE)
శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి. [QBR2] సరాసరి తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 11 (ERVTE)
యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి. [QBR2] నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
కీర్తనల గ్రంథము 19 : 12 (ERVTE)
యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు. [QBR2] కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 13 (ERVTE)
యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము. [QBR2] ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము. [QBR] నీవు నాకు సహాయం చేస్తే అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను. [QBR]
కీర్తనల గ్రంథము 19 : 14 (ERVTE)
నా మాటలు, తలంపులు నిన్ను సంతోష పెడ్తాయని నేను ఆశిస్తున్నాను. [QBR2] యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: