కీర్తనల గ్రంథము 23 : 1 (ERVTE)
యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు
కీర్తనల గ్రంథము 23 : 2 (ERVTE)
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
కీర్తనల గ్రంథము 23 : 3 (ERVTE)
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
కీర్తనల గ్రంథము 23 : 4 (ERVTE)
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
కీర్తనల గ్రంథము 23 : 5 (ERVTE)
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
కీర్తనల గ్రంథము 23 : 6 (ERVTE)
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: