కీర్తనల గ్రంథము 24 : 1 (ERVTE)
భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. [QBR2] ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 2 (ERVTE)
జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు. [QBR2] ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
కీర్తనల గ్రంథము 24 : 3 (ERVTE)
యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు? [QBR2] యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు? [QBR]
కీర్తనల గ్రంథము 24 : 4 (ERVTE)
అక్కడ ఎవరు ఆరాధించగలరు? [QBR2] చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ, [QBR2] అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు, [QBR2] అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు. [QBR2] అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
కీర్తనల గ్రంథము 24 : 5 (ERVTE)
మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు. [QBR2] ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 6 (ERVTE)
దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు. [QBR2] సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
కీర్తనల గ్రంథము 24 : 7 (ERVTE)
గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి. [QBR2] పురాతన తలుపుల్లారా తెరచుకోండి. [QBR2] మహిమగల రాజులోనికి వస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 8 (ERVTE)
ఈ మహిమగల రాజు ఎవరు? [QBR2] ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైనికుడు. [QBR2] యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
కీర్తనల గ్రంథము 24 : 9 (ERVTE)
గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి! [QBR2] పురాతన తలుపుల్లారా, తెరచుకోండి. [QBR2] మహిమగల రాజులోనికి వస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 10 (ERVTE)
ఆ మహిమగల రాజు ఎవరు? [QBR2] ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: