కీర్తనల గ్రంథము 25 : 1 (ERVTE)
యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
కీర్తనల గ్రంథము 25 : 2 (ERVTE)
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను నిరాశచెందను. నాశత్రువులు నన్ను చూచినవ్వరు.
కీర్తనల గ్రంథము 25 : 3 (ERVTE)
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కానీ నమ్మక ద్రోహులు నిరాశపడతారు. వారికి ఏమీ దొరకదు.
కీర్తనల గ్రంథము 25 : 4 (ERVTE)
యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదేశించుము.
కీర్తనల గ్రంథము 25 : 5 (ERVTE)
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
కీర్తనల గ్రంథము 25 : 6 (ERVTE)
యెహోవా, నా ఎడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నాయెడల చూపించుము.
కీర్తనల గ్రంథము 25 : 7 (ERVTE)
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
కీర్తనల గ్రంథము 25 : 8 (ERVTE)
యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 9 (ERVTE)
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 10 (ERVTE)
యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను ఆనుసరించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
కీర్తనల గ్రంథము 25 : 11 (ERVTE)
యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కానీ, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.
కీర్తనల గ్రంథము 25 : 12 (ERVTE)
ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 13 (ERVTE)
ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
కీర్తనల గ్రంథము 25 : 14 (ERVTE)
యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేసిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 15 (ERVTE)
నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 16 (ERVTE)
యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
కీర్తనల గ్రంథము 25 : 17 (ERVTE)
నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
కీర్తనల గ్రంథము 25 : 18 (ERVTE)
యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
కీర్తనల గ్రంథము 25 : 19 (ERVTE)
నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
కీర్తనల గ్రంథము 25 : 20 (ERVTE)
దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
కీర్తనల గ్రంథము 25 : 21 (ERVTE)
దేవా, నీవు నిజంగా మంచివాడివి నిన్ను నేను నమ్ముకొన్నాను కనుక నన్ను కాపాడుము.
కీర్తనల గ్రంథము 25 : 22 (ERVTE)
దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: