కీర్తనల గ్రంథము 26 : 1 (ERVTE)
యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. [QBR2] యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 2 (ERVTE)
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. [QBR2] నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 3 (ERVTE)
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. [QBR2] నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 4 (ERVTE)
పనికిమాలిన ఆ మనుష్యుల్లో [QBR2] నేను ఒకడ్ని కాను. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 5 (ERVTE)
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. [QBR2] ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
కీర్తనల గ్రంథము 26 : 6 (ERVTE)
యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. [QBR2] నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 7 (ERVTE)
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. [QBR2] నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 8 (ERVTE)
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. [QBR2] మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
కీర్తనల గ్రంథము 26 : 9 (ERVTE)
యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. [QBR2] ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 10 (ERVTE)
ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. [QBR2] చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 11 (ERVTE)
కానీ నేను నిర్దోషిని. [QBR2] కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 26 : 12 (ERVTE)
నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. [QBR2] యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: