కీర్తనల గ్రంథము 27 : 1 (ERVTE)
యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. [QBR2] నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. [QBR] యెహోవా నీవే నా జీవిత క్షేమస్థానం. [QBR2] కనుక నేను ఎవరికి భయపడను. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 2 (ERVTE)
దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు. [QBR2] వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు. [QBR] వారు నా శత్రువులు, విరోధులు. [QBR2] వారు కాలు తప్పి పడిపోదురు. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 3 (ERVTE)
ఆయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను. [QBR2] యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
కీర్తనల గ్రంథము 27 : 4 (ERVTE)
యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. [QBR2] నేను అడిగేది ఇదే: [QBR] “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. [QBR2] ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. [QBR2] యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
కీర్తనల గ్రంథము 27 : 5 (ERVTE)
నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. [QBR2] ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. [QBR2] ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 6 (ERVTE)
నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కానీ ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. [QBR2] అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. [QBR2] యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
కీర్తనల గ్రంథము 27 : 7 (ERVTE)
యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము. [QBR2] నా మీద దయ చుపించుము. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 8 (ERVTE)
యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది. [QBR2] వెళ్లు నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 9 (ERVTE)
యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము. [QBR2] కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు. [QBR2] నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 10 (ERVTE)
నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. [QBR2] అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 11 (ERVTE)
యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము. [QBR2] సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 12 (ERVTE)
నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు. [QBR2] నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 13 (ERVTE)
నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని నిజంగా నేను నమ్ముచున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 27 : 14 (ERVTE)
యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము. [QBR2] బలంగా, ధైర్యంగా ఉండుము. [QBR2] యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: