కీర్తనల గ్రంథము 29 : 1 (ERVTE)
దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. [QBR2] ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 2 (ERVTE)
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. [QBR2] మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 3 (ERVTE)
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. [QBR2] మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 4 (ERVTE)
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. [QBR2] ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 5 (ERVTE)
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. [QBR2] లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 6 (ERVTE)
లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. [QBR2] షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 7 (ERVTE)
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 8 (ERVTE)
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. [QBR2] యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 9 (ERVTE)
యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. [QBR2] ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. [QBR] ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
కీర్తనల గ్రంథము 29 : 10 (ERVTE)
వరదలను యెహోవా అదుపు చేసాడు. [QBR2] మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు. [QBR]
కీర్తనల గ్రంథము 29 : 11 (ERVTE)
యెహోవా తన ప్రజలను కాపాడును గాక. [QBR2] యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: