కీర్తనల గ్రంథము 30 : 1 (ERVTE)
యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. [QBR2] నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 2 (ERVTE)
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. [QBR2] నీవు నన్ను స్వస్థపరచావు. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 3 (ERVTE)
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. [QBR2] నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ [*గోతిలో అనగా పాతాళ లోకం.] ఉండవలసిన పనిలేదు.
కీర్తనల గ్రంథము 30 : 4 (ERVTE)
దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి. [QBR2] ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 5 (ERVTE)
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు. [QBR2] నాకు “జీవం” ప్రసాదించాడు. [QBR] రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. [QBR2] మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
కీర్తనల గ్రంథము 30 : 6 (ERVTE)
ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు. [QBR2] నేను ఎన్నటికీ ఓడించబడను. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 7 (ERVTE)
యెహోవా, నీవు నామీద దయ చూపావు. [QBR2] బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. [QBR] కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. [QBR2] మరి నేను చాలా భయపడిపోయాను. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 8 (ERVTE)
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను. [QBR2] నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 9 (ERVTE)
“దేవా, నేను మరణించి [QBR2] సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం? [QBR] ధూళి నిన్ను స్తుతిస్తుందా? [QBR2] అది నీ నమ్మకమును గూర్చి చెప్పుతుందా? [QBR]
కీర్తనల గ్రంథము 30 : 10 (ERVTE)
యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము. [QBR2] యెహోవా, నాకు సహాయం చేయుము.”
కీర్తనల గ్రంథము 30 : 11 (ERVTE)
నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు. [QBR] నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. [QBR2] నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు. [QBR]
కీర్తనల గ్రంథము 30 : 12 (ERVTE)
యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను. [QBR2] ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: