కీర్తనల గ్రంథము 31 : 1 (ERVTE)
యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 31 : 2 (ERVTE)
దేవా నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
కీర్తనల గ్రంథము 31 : 3 (ERVTE)
దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
కీర్తనల గ్రంథము 31 : 4 (ERVTE)
నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
కీర్తనల గ్రంథము 31 : 5 (ERVTE)
యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 31 : 6 (ERVTE)
వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
కీర్తనల గ్రంథము 31 : 7 (ERVTE)
దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
కీర్తనల గ్రంథము 31 : 8 (ERVTE)
నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
కీర్తనల గ్రంథము 31 : 9 (ERVTE)
యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉచుము. నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి. నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
కీర్తనల గ్రంథము 31 : 10 (ERVTE)
నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నయి. నా బలం తొలగిపోతుంది .
కీర్తనల గ్రంథము 31 : 11 (ERVTE)
నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు. నా పొరుగు వాళ్లంతా నన్ను కూడా ద్వేషిస్తారు. నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు. వారు నానుండి దూరంగా ఉంటారు.
కీర్తనల గ్రంథము 31 : 12 (ERVTE)
నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను. నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
కీర్తనల గ్రంథము 31 : 13 (ERVTE)
ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను. ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
కీర్తనల గ్రంథము 31 : 14 (ERVTE)
యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు.
కీర్తనల గ్రంథము 31 : 15 (ERVTE)
నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 31 : 16 (ERVTE)
దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 31 : 17 (ERVTE)
యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను. కనుక నేను నిరాశచెందను. చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు, మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
కీర్తనల గ్రంథము 31 : 18 (ERVTE)
ఆ చెడ్డవాళ్లు గర్వించి, మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబతారు. ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు. కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
కీర్తనల గ్రంథము 31 : 19 (ERVTE)
దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
కీర్తనల గ్రంథము 31 : 20 (ERVTE)
మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు. ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు. కానీ ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
కీర్తనల గ్రంథము 31 : 21 (ERVTE)
యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు. ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
కీర్తనల గ్రంథము 31 : 22 (ERVTE)
నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను. కానీ దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
కీర్తనల గ్రంథము 31 : 23 (ERVTE)
దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి. యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు. కానీ తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
కీర్తనల గ్రంథము 31 : 24 (ERVTE)
యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: