కీర్తనల గ్రంథము 36 : 1 (ERVTE)
“నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు [QBR2] అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 2 (ERVTE)
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు. [QBR2] ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు. [QBR2] కనుక అతడు క్షమాపణ వేడుకోడు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 3 (ERVTE)
అతని మాటలు కేవలం పనికిమాలిన ఆబద్ధాలే. [QBR2] అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 4 (ERVTE)
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు. [QBR2] అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు. [QBR2] ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
కీర్తనల గ్రంథము 36 : 5 (ERVTE)
యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది. [QBR2] నీ నమ్మకత్వం మేఘోలకంటె ఉన్నతం. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 6 (ERVTE)
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.” [QBR2] నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటే లోతైనది. [QBR] యెహోవా, నీవు మానవుని, జంతువులను కాపాడుతావు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 7 (ERVTE)
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. [QBR2] కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 8 (ERVTE)
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు. [QBR2] అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని తాగనిస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 9 (ERVTE)
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. [QBR2] నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 10 (ERVTE)
యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగిన వారిని ప్రేమించటం కొనసాగించుము. [QBR2] నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 36 : 11 (ERVTE)
యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. [QBR2] దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
కీర్తనల గ్రంథము 36 : 12 (ERVTE)
వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము. [QBR2] “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు. [QBR2] వారు చితుకగొట్టబడ్డారు. [QBR2] వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: