కీర్తనల గ్రంథము 38 : 1 (ERVTE)
యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు నీవు నన్ను సరిదిద్దేట ప్పుడు కోపగించకుము.
కీర్తనల గ్రంథము 38 : 2 (ERVTE)
యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
కీర్తనల గ్రంథము 38 : 3 (ERVTE)
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 38 : 4 (ERVTE)
నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
కీర్తనల గ్రంథము 38 : 5 (ERVTE)
నేను తెలివి తక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
కీర్తనల గ్రంథము 38 : 6 (ERVTE)
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
కీర్తనల గ్రంథము 38 : 7 (ERVTE)
నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.
కీర్తనల గ్రంథము 38 : 8 (ERVTE)
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
కీర్తనల గ్రంథము 38 : 9 (ERVTE)
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
కీర్తనల గ్రంథము 38 : 10 (ERVTE)
నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది.
కీర్తనల గ్రంథము 38 : 11 (ERVTE)
నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు.
కీర్తనల గ్రంథము 38 : 12 (ERVTE)
నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడు కొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
కీర్తనల గ్రంథము 38 : 13 (ERVTE)
అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
కీర్తనల గ్రంథము 38 : 14 (ERVTE)
ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను. నేను వాదించి , నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
కీర్తనల గ్రంథము 38 : 15 (ERVTE)
కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా నా శత్రువులకు సత్యం చెప్పుము.
కీర్తనల గ్రంథము 38 : 16 (ERVTE)
నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
కీర్తనల గ్రంథము 38 : 17 (ERVTE)
నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.
కీర్తనల గ్రంథము 38 : 18 (ERVTE)
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
కీర్తనల గ్రంథము 38 : 19 (ERVTE)
నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
కీర్తనల గ్రంథము 38 : 20 (ERVTE)
నా శత్రువులు నాకు కీడు చేస్తారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కానీ ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
కీర్తనల గ్రంథము 38 : 21 (ERVTE)
యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
కీర్తనల గ్రంథము 38 : 22 (ERVTE)
[This verse may not be a part of this translation]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: